రెండో పెళ్లికి రెడీ అవుతున్న మెగా డాటర్?
సినీ ఇండస్ట్రీలో వివిధ కారణాల వల్ల ఒంటరిగా జీవిస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Aug 2025 12:51 PM ISTసినీ ఇండస్ట్రీలో వివిధ కారణాల వల్ల ఒంటరిగా జీవిస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కొందరు తమ జీవిత భాగస్వామి దూరమవడం వల్ల ఒంటరిగా ఉండాల్సి వస్తే, మరికొందరు తమ పార్టనర్ నుంచి విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు. అయితే అందులో కొందరు దాన్నుంచి బయటపడి మరొకరిని పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసి హ్యాపీగా ఉంటున్నారు.
కన్ఫ్యూజన్ లో నిహారిక
కానీ మరికొందరు మాత్రం లైఫ్ లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక కూడా ఇదే పొజిషన్ లో ఉన్నారు. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో భర్త నుంచి విడాకులు తీసుకుని సింగిల్ గా ఉంటున్న నిహారిక ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది.
పెళ్లి కూతురు గెటప్ లో..
నిహారిక పెళ్లి ఆల్రెడీ ఫిక్స్ అయిందని కొందరంటుంటే, మరికొందరు మాత్రం ఆమె ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని ఎవరికి నచ్చింది వారంటున్నారు. రీసెంట్ గా నిహారిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఈ వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి. నిహారిక షేర్ చేసిన ఈ ఫోటోల్లో ఆమె అచ్చు పెళ్లికూతురు లానే మెరిసిపోయారు. పట్టు చీర, దానికి సరిపోయే బంగారు ఆభరణాలు, నడుముకు వడ్డాణం, మట్టి గాజులు ధరించి ఎంతో సాంప్రదాయంగా కనిపించారు.
ఫోటోషూట్ కోసమే..
ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఈ లుక్ కేవలం ఫోటో షూట్ లో భాగం మాత్రమేనని, రియల్ లైఫ్ కు సంబంధించింది కాదని నిహారిక స్పష్టం చేసినప్పటికీ, ఆమె సెకండ్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న నిహారిక ప్రస్తుతం తన తల్లిదండ్రులతోనే ఉంటున్న విషయం తెలిసిందే. పెళ్లి తన జీవితాన్ని ఎంతగానో మార్చేసిందని, ఆ బాధను ఎవరూ పోగొట్టలేరని కూడా నిహారిక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మొన్నా మధ్య నిహారిక తండ్రి నాగబాబు కూడా ఆమె ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ, ఆమె కచ్ఛితంగా మళ్లీ పెళ్లి చేసుకుని, ఆనందంగా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.
