నవ్వుల పండుగకు సిద్ధమైన ‘మిత్ర మండలి’
ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే కామెడీ ఎంటర్టైనర్లు ఎప్పటికీ స్పెషల్ ఆకర్షణగానే ఉంటాయి. అచ్చం అలాంటి నవ్వుల పండుగను ఈసారి దీపావళి కానుకగా అందించేందుకు సిద్ధమవుతోంది ‘మిత్ర మండలి’ సినిమా.
By: M Prashanth | 1 Sept 2025 3:27 PM ISTటాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్త జానర్స్ ను ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే కామెడీ ఎంటర్టైనర్లు ఎప్పటికీ స్పెషల్ ఆకర్షణగానే ఉంటాయి. అచ్చం అలాంటి నవ్వుల పండుగను ఈసారి దీపావళి కానుకగా అందించేందుకు సిద్ధమవుతోంది ‘మిత్ర మండలి’ సినిమా.
ఇప్పటికే టీజర్, పాటలు ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల తేదీని ప్రకటించిన వీడియో, పోస్టర్ కూడా సోషల్ మీడియాలో హవా చేస్తోంది. బాణసంచా వాతావరణంలో ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎనర్జీని చూపిస్తూ వచ్చిన విజువల్స్, ప్రకటన వీడియో సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి.
ఇక అసలు విషయానికి వస్తే అక్టోబర్ 16న దీపావళి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దీపావళి అంటేనే పండుగ, ఆనందం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అలాంటి సమయంలో థియేటర్లలో నవ్వుల టపాసులు పేల్చేందుకు ‘మిత్ర మండలి’ సిద్ధమవుతుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో హైప్ రెట్టింపైంది.
ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరు తెరపై కలిసినపుడు కామెడీ గ్యాంగ్ వాతావరణం తరహాలో ఉంటుందని ఇప్పటికే టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. యూత్ ఎనర్జీ, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిసిన ఈ కథను డైరెక్టర్ విజయేందర్ ఎస్ కొత్తదనంతో ప్రెజెంట్ చేయబోతున్నారు.
సాంకేతికంగా కూడా సినిమా స్ట్రాంగ్ టీమ్ తో తయారవుతోంది. ఆర్.ఆర్. ధృవన్ మ్యూజిక్, సిద్ధార్థ్ ఎస్.జె సినిమాటోగ్రఫీ, గాంధీ నడికుడికర్ ఆర్ట్ వర్క్, పీకే ఎడిటింగ్, శిల్పా టంగుటూరు కాస్ట్యూమ్స్ ఇలా అన్ని విభాగాల్లో పాజిటివ్ వైబ్ తో టీమ్ సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడే టెక్నికల్ రిచ్‌నెస్ బాగా అర్థమవుతోంది. మొత్తం మీద, దీపావళి 2025ను మరింత మజాగా మార్చేందుకు ‘మిత్ర మండలి’ రెడీ అయింది. ఇక జనాలని ఈ సినిమా ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.
