Begin typing your search above and press return to search.

ఋతుచక్రంపై ఆసక్తికర పోస్ట్ పంచుకున్న మెగా డాటర్.. అడిగింది ఇవ్వండంటూ!

ఋతుక్రమం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక స్థితితో పాటూ శరీరంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని అందరికీ తెలిసిందే.

By:  Madhu Reddy   |   7 Aug 2025 5:53 PM IST
ఋతుచక్రంపై ఆసక్తికర పోస్ట్ పంచుకున్న మెగా డాటర్.. అడిగింది ఇవ్వండంటూ!
X

మెగా డాటర్ నిహారిక ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా మహిళలు ఎదుర్కొనే ఋతుచక్రంపై ఒక పోస్టు పంచుకుంది. సాధారణంగా ఋతుక్రమం సమయంలో మహిళలు ఎదుర్కొనే మార్పుల గురించి ఉదాహరణతో సహా పోస్ట్ చేసింది నిహారిక.

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా నిహారిక జిమ్ నుండి రెండు ఫోటోలను పంచుకుంది. అందులో తాను ఋతుక్రమానికి ముందు ఒక ఫోటో, ఋతుక్రమం తర్వాత తీసుకున్న ఫోటో.. రెండింటిని షేర్ చేసింది. అందులో ఋతుక్రమం రావడానికి ముందు ఆమె కాస్త బొద్దుగా కనిపించగా.. ఋతుక్రమం తర్వాత ఆమె కాస్త సన్నగా కనిపించారు. ఈ రెండు ఫోటోలను ఆమె షేర్ చేస్తూ.. కేవలం నాలుగు రోజుల్లోనే తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి పోస్ట్ పంచుకుంది నిహారిక.

ఋతుక్రమం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక స్థితితో పాటూ శరీరంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఇలా మానసిక స్థితిలో మార్పులు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఏం చేయాలి.. ?అనే విషయాలను చాలా చక్కగా వివరించింది. "ప్రియమైన మహిళల్లారా.. శరీరాన్ని ప్రేమించండి.. శరీరం అడిగింది ఇస్తే అది మనల్ని మరింత అందంగా మారుస్తుంది. నేను కఠిన నియమాలతో దీనిని నేర్చుకున్నాను. అయితే మీరు కూడా చేయాల్సిన అవసరం లేదు" అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం నిహారిక పంచుకున్న ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అని చెప్పవచ్చు.

నిహారిక విషయానికి వస్తే.. ప్రముఖ సీనియర్ నటుడు నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక. వెనుక కొండంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. హీరోయిన్ గా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టిన నిహారిక..ఈ సినిమాతో సక్సెస్ అవుతుంది అనుకున్నారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 'సూర్యకాంతం' తోపాటు పలు చిత్రాలు చేసింది. కానీ అవి కూడా ఈమె కెరియర్ కు ఉపయోగపడలేదు. దాంతో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. అయితే దాంపత్య జీవితంలో సఖ్యత లేకపోవడంతో విడాకులు తీసుకొని విడిపోయింది. ప్రస్తుతం తండ్రితో కలిసి ఉంటున్న ఈమె.. తండ్రి సలహా మేరకు నిర్మాతగా మారింది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా నిర్మించింది. ఈ సినిమాతో గద్దర్ అవార్డు కూడా అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది నిహారిక.. నటిగా కెరియర్లో సక్సెస్ కాలేకపోయినా నిర్మాతగా తొలి అడుగు వేసి భారీ సక్సెస్ చవిచూసింది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలతో వార్తల్లో నిలుస్తోంది.