Begin typing your search above and press return to search.

సారీ అమ్మా అంటూ నిహారిక పోస్ట్.. నెట్టింట వైర‌ల్

తెలుగు ఆడియ‌న్స్ కు నిహారిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఓ వైపు న‌టిగా సినిమాలు చేస్తూనే, మ‌రోవైపు నిర్మాత‌గా కూడా సినిమాల‌ను నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు నిహారిక‌.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 Sept 2025 11:47 AM IST
సారీ అమ్మా అంటూ నిహారిక పోస్ట్.. నెట్టింట వైర‌ల్
X

పిల్లలు ఎంత పెద్ద వాళ్లైనా త‌ల్లిదండ్రుల‌కు మాత్రం ఎప్ప‌టికీ చిన్న పిల్ల‌లే. అందుకే వారు ఎప్పుడు బ‌య‌టికెళ్తున్నా వారికి జాగ్ర‌త్త‌లు చెప్ప‌డంతో పాటూ తిరిగి ఇంటికి వ‌చ్చి వారి క‌ళ్ల ముందు క‌నిపించే వ‌ర‌కు దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటారు. సెల‌బ్రిటీలు సైతం ఇందుకు అతీతులు కాదు. ఇదే విష‌యాన్ని రీసెంట్ గా మెగా డాట‌ర్ నిహారిక త‌న సోష‌ల్ మీడియాలో తెలిపారు.

తెలుగు ఆడియ‌న్స్ కు నిహారిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఓ వైపు న‌టిగా సినిమాలు చేస్తూనే, మ‌రోవైపు నిర్మాత‌గా కూడా సినిమాల‌ను నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు నిహారిక‌. అయితే సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నిహారిక త‌న ఫ్రెండ్స్ తో లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

వీడియోతో వైర‌ల్ అయిన నిహారిక‌

సోష‌ల్ మీడియాలో త‌న‌కు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉండే నిహారిక తాజాగా చేసిన ఓ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది. నిహారిక త‌న ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ దానికి సారీ అమ్మా! అంటూ క్యాప్ష‌న్ ను యాడ్ చేశారు. ఆ వీడియోలో ఎత్తైన వాటర్‌ఫాల్ వ‌ద్ద పెద్ద ఎత్తున నీటి ప్ర‌వాహంతో పాటూ విప‌రీత‌మైన గాలితో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ వాతావ‌ర‌ణంలో నిహారిక ఎంజాయ్ చేస్తూ క‌నిపించారు.

నిహారిక చేసిన పోస్ట్ కు త‌న వ‌దిన లావ‌ణ్య త్రిపాఠి న‌వ్వుతున్న ఎమోజీ పెట్టి కామెంట్ చేయగా ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు మాత్రం నిహారికకు జాగ్ర‌త్త‌లు చెప్తూ అమ్మ చెప్పిన‌ట్టు మీరు క్షేమంగా రావాల‌ని కోరుకుంటున్నామ‌ని కామెంట్స్ చేస్తు్నారు. క‌మిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాత‌గా మంచి స‌క్సెస్ ను అందుకున్న నిహారిక ప్ర‌స్తుతం సంతోష్ శోభ‌న్ హీరోగా నెక్ట్స్ మూవీ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు.