మా అన్న దెబ్బ తగిలినా షూటింగ్ కు వెళ్తున్నాడు
మెగా కుటుంబానికి చెందిన నటి, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా తన సినిమా రాకాస ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
By: Sravani Lakshmi Srungarapu | 2 April 2026 6:42 PM ISTమెగా కుటుంబానికి చెందిన నటి, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా తన సినిమా రాకాస ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఆమె అన్న, స్టార్ హీరో రామ్ చరణ్ గురించి చెప్పిన మాటలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. రీసెంట్ గా రాకాస ప్రమోషన్స్ లో భాగంగా ఓ రిపోర్టర్ రామ్ చరణ్ గారు ఈ సినిమా చూసారా? అని అడగ్గా, నిహారిక చాలా హృదయపూర్వకంగా స్పందించింది. పాపం మా అన్నకు రీసెంట్ గా గాయం అయ్యింది. అయినప్పటికీ ఆయన ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ పరిస్థితిలో నా సినిమా చూడమని నేను ఎలా అడగగలనంటూ నిహారిక చెప్పింది.
అయితే, సమయం దొరికిన వెంటనే చరణ్ తప్పకుండా సినిమా చూస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. ఆయన నా సినిమా చూడకుండా ఉండరు నిహారిక చెప్పిన మాటలు అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపించాయి. మెగా ఫ్యామిలీలో అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకమే. ముఖ్యంగా రామ్ చరణ్, నిహారిక మధ్య ఉన్న బాండింగ్ గురించి చాలా సందర్భాల్లో బయటపడింది. చరణ్ కూడా తన చెల్లి కెరీర్‌కు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తూ ఉంటాడు. అదే విధంగా నిహారిక కూడా తన అన్నపై అపారమైన ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న నిహారిక, ఆయన గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మా చరణ్ అన్న ఎంతో మంచోడంటూ ఆమె ఇచ్చిన ఎలివేషన్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం కుటుంబ అనుబంధానికే కాకుండా, వారి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను కూడా తెలియజేశాయి.
ఇక రాకాస సినిమా విషయానికి వస్తే, ఇది ఫాంటసీ కామెడీ జానర్‌లో తెరకెక్కిన సినిమా. నిహారిక తన బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌పై ఆమె ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. మొత్తమ్మీద, నిహారిక చెప్పిన మాటలు చూస్తే ఆమెకు తన అన్నపై ఉన్న ప్రేమ ఎంత గాఢమో స్పష్టమవుతోంది. ఒకవైపు తన సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తూనే, మరోవైపు అన్న ఆరోగ్యం గురించి ఆలోచించడం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. రామ్ చరణ్ కోలుకుని త్వరలోనే రాకాస సినిమాను చూసి స్పందిస్తారని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.
