కమెడియన్ సత్యను ఇరికించిన నిహారిక
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది.
By: M Prashanth | 7 Aug 2026 10:43 AM ISTమెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ మొదటి నుంచి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మెగా డాటర్ నిహారిక కొణిదెల తనదైన స్టైల్ లో ఒక స్పెషల్ చిట్ చాట్ చేయడం అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. వరుణ్ తేజ్ తో పాటు డైరెక్టర్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఆమె చేసిన ఈ ఫన్నీ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇంటర్వ్యూ మొదలవ్వగానే టీమ్ అంతా చప్పట్లతో నిహారికను భలే ఉత్సాహపరిచారు. అసలు తనను ఈ ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారో తెలుసా అంటూ ఆమె చాలా క్యాజువల్ గా సంభాషణ స్టార్ట్ చేసింది. తను ఏ ఇంటర్వ్యూ చేసినా సరే అది కచ్చితంగా వైరల్ అవుతుందని, అందుకే వాళ్లు తనను ఇక్కడికి తీసుకొచ్చారని సరదాగా సెటైర్ వేసింది. డైరెక్టర్ కూడా ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఇలాంటి ఒక వైరల్ ఇంటర్వ్యూ కచ్చితంగా కావాలన్నట్లుగా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.
ఇదే క్రమంలో సినిమా షూటింగ్ కోసం జేజు ఐలాండ్ వెళ్ళినప్పుడు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని నిహారిక ఇంటర్వ్యూలో గుర్తు చేసింది. కొరియాలో షూటింగ్ గ్యాప్ లో కమెడియన్ సత్య ఎవరికి కనిపించకుండా రెండు గంటలు బయటకు వెళ్లినట్లు నాకు గాంధీ గారు చెప్పారని నిహారిక అడిగారు. అందుకు సత్య సరదాగా కాస్మోటిక్స్ షాపింగ్ కోసం వెళ్లినట్లు కవర్ చేశాడు. తీరా వెనక్కి వచ్చేసరికి వెనుక కొంచెం గాట్లు అవి ఉన్నాయట ఏంటి సంగతి అన్నట్లు ఇరికించే ప్రయత్నం చేశారు.
వైరల్ అవ్వడం అంటే ఇదా అన్నట్లు సత్య అడగడంతో.. ఓ సినిమా గురించా అన్నట్లు మ్యాటర్ డైవర్ట్ చేశారు. ఇక సినిమా సెట్స్ లో జరిగిన ఇంకొన్ని విషయాలను కూడా డైరెక్టర్ పంచుకున్నారు. ఈ సినిమాలో షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ వరకు ప్రతి దశలో ఒక క్లైమాక్స్ రేంజ్ టెన్షన్ ను ఫీల్ అయ్యారని టీమ్ అంతా ఒప్పుకున్నారు. ఆ టెన్షన్ ఏమాత్రం బయటకు కనిపించకపోయినా, లోపల మాత్రం చాలా ఆందోళన చెందామని వారు చెప్పారు. బయటకు నవ్వుతూనే లోపల ఉన్న ఆ ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేశారో వాళ్లు ఈ చిట్ చాట్ లో సరదాగా వివరించారు.
షూటింగ్ లో ఎదుర్కొన్న అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వైరల్ అవుతాయని నిహారిక ధీమా వ్యక్తం చేసింది. టీమ్ కి కొన్ని సిట్యువేషన్స్ ఇచ్చి దానికి తగ్గట్టుగా వాళ్ల రియాక్షన్స్ తీసుకుని మీమ్స్ క్రియేట్ చేద్దామని ఆమె ఒక కొత్త టాస్క్ ఇచ్చింది. ఈ టాస్క్ లో చిత్ర యూనిట్ అంతా చాలా యాక్టివ్ గా పాల్గొని ఇంటర్వ్యూని మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ గా మార్చేశారు.
గతంలో కొరియన్ ఫుడ్ తింటూ చేసిన ఒక ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంది. ఇప్పుడు నిహారిక చేసిన ఈ ఇంటర్వ్యూ కూడా ఫుల్ ఫన్ తో సాగడంతో నేటి తరం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి ప్రమోషన్స్ తో ఈ సినిమా జనాలకు సులువుగా రీచ్ అయ్యేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ఇన్ని అంచనాలతో నేడు థియేటర్లలోకి వస్తున్న ఈ కొరియన్ కనకరాజు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
