Begin typing your search above and press return to search.

బోనం సమర్పించిన మెగా డాటర్.. అసలు హైలెట్ అదే!

నటిగా, విజయవంతమైన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల పాతబస్తీలోని ప్రసిద్ధ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో సందడి చేశారు.

By:  Madhu Reddy   |   8 Aug 2026 11:35 PM IST
బోనం సమర్పించిన మెగా డాటర్.. అసలు హైలెట్ అదే!
X

నటిగా, విజయవంతమైన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల పాతబస్తీలోని ప్రసిద్ధ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో సందడి చేశారు. నగరంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ అమ్మవారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు. షూటింగ్ బిజీ వల్ల ప్రధాన బోనాల రోజు రాలేకపోయినా, అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించాలనే తన కోరిక తీరడంపై నిహారిక ఎంతో సంతోషం వ్యక్తం చేశారు..

పూర్ణకుంభంతో ఘన స్వాగతం:

హైదరాబాద్ అంతటా బోనాల సంబరాలు వైభవంగా సాగుతున్న సమయంలో నిహారిక కొణిదెల మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణానికి వచ్చిన ఆమెకు ప్రధాన అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఇక మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారి దర్శనం చేసుకున్న నిహారిక, ఎంతో భక్తిశ్రద్ధలతో బంగారు బోనాన్ని శిరస్సుపై ధరించి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ విశిష్టతను వివరించిన చైర్మన్:

దర్శనానంతరం ఆలయ యంత్రాంగం నిహారికను శాలువాతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వాళ్ళు నిహారికకు ఆలయ చారిత్రక ప్రాశస్త్యాన్ని, శతాబ్దాలుగా నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల విశిష్టతను, సంప్రదాయాలను వివరంగా వివరించారు. ఇక అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా నిహారిక తెలిపారు.

మనసులో కోరిక తీరిందన్న నిహారిక:

అనంతరం నిహారిక మాట్లాడుతూ.. "ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయాను. అందుకే ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చాను. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నాకు బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని వెళ్లే సాళువ నన్ను ఎప్పుడూ ఆకట్టుకునేవి. ఇక నన్ను కూడా ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుండు అని సరదాగా అనుకున్నాను. ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరడం అమ్మవారి అనుగ్రహమే" అని పేర్కొన్నారు.

ఆలయంలో భక్తుల సందడి:

నిహారిక ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు, అభిమానులు ఆమెను చూడటానికి భారీగా తరలివచ్చారు. స్థానికులు, భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు తీవ్ర ఆసక్తి చూపించడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఆలయ నిర్వాహకులు తగిన భద్రతా చర్యలు చేపట్టి దర్శనం సాఫీగా జరిగేలా చూశారు.

అమ్మవారి దివ్య ఆశీస్సులు:

అమ్మవారి విగ్రహం దివ్య కాంతులతో అలరించిందని, దర్శనం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా జరిగిందని నిహారిక తెలిపారు. ఇక భవిష్యత్తులో కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భక్తిశ్రద్ధలతో బంగారు బోనం సమర్పించిన నిహారిక ఆలయ దర్శనం ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.