Begin typing your search above and press return to search.

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

దీపావళి వేడుకల్లో నిహారిక కొణిదెల సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు, స్నేహితులతో డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే పాప్ పాప్ టపాసులు పేలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆమె ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లను నవ్విస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

By:  Madhu Reddy   |   11 Nov 2026 3:08 PM IST
నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!
X

మెగా ఫ్యామిలీకి చెందిన నటి, నిర్మాత నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. నిర్మాతగా కూడా విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నిహారిక.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా దీపావళి వేడుకలకు సంబంధించిన ఆమె ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని టపాసుల విషయంలో నిహారిక ఇచ్చిన రియాక్షన్ అందరినీ నవ్విస్తోంది.




నిహారిక సినీ ప్రయాణం ఇదే:

నిహారిక కొణిదెల మెగా కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నించారు. మొదట బుల్లితెరపై యాంకర్‌గా ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. 2016లో విడుదలైన 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.




తెలుగు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటించి తన ప్రతిభను చాటుకున్నారు. నటనతో పాటు నిర్మాణ రంగంపై ఆసక్తి పెంచుకున్న నీహారిక.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు వెబ్ ప్రాజెక్టులను నిర్మిస్తూ నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.




దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న నిహారిక :

సాధారణంగా పండుగలు, ప్రత్యేక సందర్భాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకోవడానికి నీహారిక ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా అందమైన దుస్తుల్లో దిగిన ఫొటోలను, దీపావళి సంబరాలకు సంబంధించిన ప్రత్యేక క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

పాప్ పాప్ టపాసులతో నిహారికకు షాక్:

ఇక దీపావళి వేడుకల్లో భాగంగా నిహారిక టపాసులు కాలుస్తూ సందడి చేశారు. అయితే పాప్ పాప్ అంటూ శబ్దం చేసే నేల టపాసులు ఆమెను కాస్త ఇబ్బంది పెట్టినట్లు కనిపిస్తోంది. మొదట వాటిని చూసి అవేంటో అర్థంకాక వింతగా ఫీల్ అయిన ని హారిక.. వాటిని నేలకేసి కొట్టిన తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డారు. ఊహించని విధంగా వచ్చిన ఆ శబ్దానికి ఆమె ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది.

టపాసులు పేలిన వెంటనే ని హారిక భయపడిన తీరు, ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపించిన హావభావాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా పండుగ సమయంలో పిల్లలు, పెద్దలు ఇలాంటి టపాసులతో సరదాగా గడుపుతుంటారు. కానీ నిహారిక మాత్రం ఈ క్రేజీ టపాసుల విషయంలో కాస్త హడలిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అభిమానులను ఆకట్టుకుంటున్న ఫొటోలు, వీడియోలు :

దీపావళి సందర్భంగా నిహారిక పంచుకున్న ఫొటోలు, వీడియోలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించడంతో పాటు స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, పండుగను ఉత్సాహంగా జరుపుకున్న క్షణాలను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా టపాసుల దగ్గర ఆమె ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ దీపావళి వేడుకల్లో నిహారిక అందం, సందడి మాత్రమే కాకుండా ఆమె భయపడిన తీరు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.