చిన్మయి వాయిస్.. నిహారిక అలా అనిందేంటి?
అయితే స్పీచ్ చివర్లో సంగీత్ శోభన్.. సినిమా హిట్ అయితే తనకు రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ ఇస్తానని నిహారిక చెప్పినట్లు పేపర్ ను చూసి చదివారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి నిహారికపై పడగా.. ఆమె మాట్లాడారు.
By: M Prashanth | 14 March 2026 3:28 PM ISTప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఇప్పటికే అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి మ్యూజిక్ లవర్స్ మనసులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కేవలం గాయని గానే కాకుండా, పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె గుర్తింపు సంపాదించారు. తన స్వీట్ వాయిస్ తో ఎన్నో చిత్రాల్లో పాటలు పాడిన చిన్మయి, తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
తాజాగా చిన్మయి వాయిస్ ను ప్రస్తావిస్తూ మెగా డాటర్ నిహారిక కొణిదెల చేసిన ఒక్క వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్న కామెంట్ అయినా.. నెటిజన్ల మధ్య భారీ చర్చకు దారితీసింది. నిహారిక.. ప్రస్తుతం నిర్మాతగా వరుస సినిమాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక తాజాగా రాకాసా మూవీ నిర్మిస్తున్నారు.
సంగీత్ శోభన్, నయన్ సారిక లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ మూవీ.. మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. దీంతో మేకర్స్ రీసెంట్ గా సినిమాలోని సెకెండ్ సింగిల్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. నిహారిక అటెండ్ అయ్యారు. వేడుకలో భాగంగా వేదికపై మాట్లాడేందుకు వెళ్లిన మెగా డాటర్.. గొంతు నొప్పి వల్ల ఇబ్బంది పడ్డారు. అప్పుడే నిహారిక గొంతు బాగోలేదని, అందుకే ఆమె తరఫున తానే మాట్లాడతానని సంగీత్ అన్నారు.
అయితే స్పీచ్ చివర్లో సంగీత్ శోభన్.. సినిమా హిట్ అయితే తనకు రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ ఇస్తానని నిహారిక చెప్పినట్లు పేపర్ ను చూసి చదివారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి నిహారికపై పడగా.. ఆమె మాట్లాడారు. గొంతు సమస్య ఉందని, కానీ ఇలా ఊరుకుంటే సినిమా రిలీజ్ అయ్యాక బడ్జెట్ పెరిగిపోతుందని నవ్వేశారు. అందుకే చిన్మయి లాంటి గొంతుతో తాను మేనేజ్ చేస్తానని అన్నారు.
అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారగా.. అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. కొందరు సరదాగా తీసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం చిన్మయి గొంతుతో పోల్చి మాట్లాడటం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇంకా కొందరు నెటిజన్లు కామెడీగా చేసిన కామెంట్ నేనని చెబుతున్నారు. కార్యక్రమంలో ఉన్న వారంతా కూడా దీనిని సరదాగా తీసుకున్నారని అంటున్నారు.
ఆ విషయంపై ఇప్పటివరకు చిన్మయి ఎక్కడా స్పందించలేదు. ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అనే విషయాన్ని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై ఆమె స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి ఒక చిన్న కామెంట్ తో ప్రారంభమైన డిస్కషన్ ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
