దసరా స్పెషల్.. చీరకట్టులో ఆకట్టుకుంటున్న నిహారిక!
అలా చీర కట్టులో కనిపించి చాలా అందంగా నవ్వుతూ అందరి హృదయాలను దోచుకుంది నిహారిక. ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
By: Madhu Reddy | 1 Oct 2025 6:17 PM ISTఏవైనా పండుగలు వచ్చాయి అంటే సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ ఆయా పండుగలను చాలా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలైతే ఈ పండుగ క్షణాలను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి, మెగా డాటర్ నిహారిక కూడా తాజాగా దసరా స్పెషల్ సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
యాష్ కలర్ పట్టుచీర ధరించిన ఈమె.. దీనికి ఆపోజిట్ పింక్ కలర్ బ్లౌజ్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాదు జడ వేసుకుని చక్కగా పువ్వులు ధరించి.. సింపుల్ జువెలరీ తో తన మేకోవర్ ను ఫినిష్ చేసింది. పండుగ వేళ అందంగా ముస్తాబవడమే కాకుండా అంతకుమించి మరింత అందంగా నవ్వుతూ చూసే వారిని ఆకట్టుకుంటుంది నిహారిక. ఈ ఫోటోలు షేర్ చేస్తూ చాట్ జిపిటిని ఏదైనా ఒక మంచి క్యాప్షన్.. తన పండుగ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఈ ఫోటోలకు ఇవ్వమని క్యాప్షన్ కూడా పంచుకుంది. అలా చీర కట్టులో కనిపించి చాలా అందంగా నవ్వుతూ అందరి హృదయాలను దోచుకుంది నిహారిక. ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నిహారిక విషయానికి వస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఏకైక వారసురాలు అని చెప్పవచ్చు. అటు మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నా.. ఆమె క్యాస్టింగ్ డిజైనర్ గా, నిర్మాతగా చలామణి అవుతున్నారు. కానీ నిహారిక మాత్రమే ఇలా హీరోయిన్గా , నటిగా ప్రేక్షకులను అలరిస్తోంది.
నిహారిక కెరియర్ విషయానికి వస్తే.. 1993 డిసెంబర్ 18న మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, ప్రముఖ నటుడు మెగా బ్రదర్ నాగేంద్రబాబు, పద్మజ కొణిదెల దంపతులకు జన్మించింది నిహారిక. 2016లో ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్, సైరా నరసింహారెడ్డి, డార్లింగ్, మద్రాస్ కారన్ వంటి చిత్రాలలో నటించింది. తెలుగు, తమిళ్ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు వాట్ ద ఫిష్ అనే సినిమాలో కూడా నటిస్తోంది.
హీరోయిన్గా సక్సెస్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన నిహారిక ఆవైపు సక్సెస్ కాకపోవడంతో 2015లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా మారి.. గత ఏడాది కమిటీ కుర్రోళ్ళు సినిమా చేసి నిర్మాతగా సక్సెస్ అందుకుంది.. ఇకపోతే అటు వైవాహిక బంధంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను రాజస్థాన్లోని ఉదయపూర్ లోని ఒబెరాయ్ ఉదయ విలాస్ లో వివాహం చేసుకుంది. కానీ మనస్పర్ధలు రావడంతో 2023 జూలై 5న విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
