బావకు మెగా డాటర్ స్పెషల్ విషెస్!
మెగా కాంపౌండ్ నుండి వచ్చి సక్సెస్ రేట్ దక్కించుకున్న హీరోలలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు.
By: Madhu Reddy | 15 Oct 2025 1:10 PM ISTమెగా కాంపౌండ్ నుండి వచ్చి సక్సెస్ రేట్ దక్కించుకున్న హీరోలలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు. యాక్సిడెంట్ తర్వాత పునర్జన్మ పొందిన ఈయన బ్రో సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత వచ్చిన విరూపాక్ష సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరిన సాయి ధరంతేజ్ ఇప్పుడు సంబరాలు ఏటిగట్టు అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ఈరోజు అనగా అక్టోబర్ 15 సాయి ధరంతేజ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా నుండి అసుర ఆగమన అంటూ ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు.
మరోవైపు సాయి ధరంతేజ్ పుట్టినరోజు కావడంతో ఆయనకు అభిమానులు, సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక కూడా ఒక స్పెషల్ పోస్ట్ పంచుకుంటూ బావకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో "హ్యాపీ బర్తడే బావ ..ఐ లవ్ యూ " అంటూ రెడ్ హార్ట్ సింబల్ ని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బావ కోసం మరదలు నిహారిక చెప్పిన ఈ స్పెషల్ విషెస్ మరింత వైరల్ గా మారిందని చెప్పవచ్చు. అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన ఒక ఫోటోని కూడా ఆమె షేర్ చేసింది.
నిహారిక విషయానికి వస్తే.. హీరోయిన్ గా సక్సెస్ అవుదాం అనుకున్న ఈమెకు నిరాశే ఎదురయింది. దీంతో నిర్మాతగా మారి 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా నిర్మించి, నిర్మాతగా మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై నిహారిక నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
నిహారిక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. చైతన్య జొన్నలగడ్డను పెద్దల కోరిక మేరకు 2020 డిసెంబర్ 9న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహం చేసుకుంది. అయితే వివాహం జరిగిన మూడు సంవత్సరాలకే అనగా 2023 జూలై 5న విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడంపై స్పందించిన ఈమె ఒక మంచి లైఫ్ పార్టనర్ దొరికితే మళ్ళీ ప్రేమలో పడే అవకాశం ఉందని చెప్పింది. అయితే అదే దిశగా అయితే ఆలోచించడం లేదు అని కూడా స్పష్టం చేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టిన నిహారిక ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తూ బిజీగా మారిపోయింది.
సాయి ధరంతేజ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకుడిగా.. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో మైథాలజీ టచ్ తో రాబోతున్న ఈ యాక్షన్ డ్రామా పై ఇప్పుడు అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.
