నిధి మరో పాన్ ఇండియా జాక్ పాట్..!
వీరమల్లు సినిమాకు పవన్ కళ్యాణ్ కన్నా ముందు నిధి బూస్టింగ్ సినిమాకు హెల్ప్ అయ్యింది.
By: Ramesh Boddu | 29 July 2025 3:49 PM ISTఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కెరీర్ టాలీవుడ్ మళ్లీ ట్రాక్ ఎక్కేసింది. తెలుగులో మొదటి రెండు సినిమాలు అక్కినేని హీరోలతో చేసి డిజప్పాయింట్ చేసిన అమ్మడు పూరీ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి అదరగొట్టేసింది. ఐతే ఆ తర్వాత తెలుగు సినిమాలు కాకుండా తమిళ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేసింది. మళ్లీ హరి హర వీరమల్లు, రాజా సాబ్ తో తెలుగులో సందడి చేస్తుంది. సినిమాల కన్నా సినిమా రిలీజ్ టైం లో హీరోయిన్స్ చేసే సపోర్ట్ ఎక్కువ కనబడుతుంది.
నిధి బూస్టింగ్ సినిమాకు హెల్ప్..
వీరమల్లు సినిమాకు పవన్ కళ్యాణ్ కన్నా ముందు నిధి బూస్టింగ్ సినిమాకు హెల్ప్ అయ్యింది. అందుకే నిధిని మళ్లీ మళ్లీ చూడాలని ఉందని తెలుగు ఆడియన్స్ అంటున్నారు. ఈ క్రమంలోనే అమ్మడు ఒక పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. నిధి ఇప్పటికే ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కూడా అమ్మడికి మంచి బ్రేక్ ఇచ్చేలా ఉంది.
నెక్స్ట్ నిధి మరో స్టార్ సినిమా అది కూడా పాన్ ఇండియా బొమ్మ లో అవకాశం అందుకుందట. నిజంగానే అది నిధికి జాక్ పాట్ అని చెప్పొచ్చు. అందులో సోలో హీరోయిన్ గా నిధికి ఆఫర్ వచ్చిందట. అది నిజంగానే అమ్మడికి లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. నిధి అగర్వాల్ దూకుడు చూస్తుంటే మళ్లీ తెలుగులో అదరగొట్టేలా ఉంది.
హరి హర వీరమల్లు వల్ల లాభపడ్డ నిధి..
నిధి అగర్వాల్ ఫ్యాన్స్ కి ఈ ఆఫర్లు సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఇంతకీ నిధిని ఓకే చేసిన పాన్ ఇండియా సినిమా ఏంటి.. ఆ స్టార్ హీరో ఎవరన్న డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. హరి హర వీరమల్లు వల్ల లాభపడిన వారిలో నిధి అగర్వాల్ ఒకరు. సినిమాలో ఆమె రోల్ చాలా తక్కువే సేపు ఉన్నా కూడా అంతకు తగిన ఇంపాక్ట్ చూపించింది.
ఐతే వీరమల్లు క్రేజ్ ఆఫ్ స్క్రీన్ పై నిధి ఇమేజ్ ని పెంచింది. ఒక్కసారిగా నిధి గురించి సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. సో నిధి ఈ జోష్ రాజా సాబ్ కి కూడా కొనసాగిస్తే మాత్రం తెలుగు ఆడియన్స్ ఆమెను టాప్ లెవెల్ కి తీసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.
