Begin typing your search above and press return to search.

నిధి అగర్వాల్.. రాజాసాబ్ 'సర్ప్రైజ్' చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన వీరమల్లు కోసం ఐదేళ్లపాటు డేట్స్ కేటాయించింది.

By:  M Prashanth   |   17 Aug 2025 1:51 PM IST
నిధి అగర్వాల్.. రాజాసాబ్ సర్ప్రైజ్ చూశారా?
X

టాలీవుడ్ లో టాలెంటెడ్, ప్రామిసింగ్ హీరోయిన్స్ లిస్టులో అందాల భామ నిధి అగర్వాల్ కచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సవ్యసాచి మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మడు.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. రీసెంట్ గా హరిహర వీరమల్లు మూవీతో సందడి చేసింది నిధి.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన వీరమల్లు కోసం ఐదేళ్లపాటు డేట్స్ కేటాయించింది. కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్ అందుకోని నిధి అగర్వాల్.. ఇప్పుడు రాజా సాబ్ పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ మారుతి కాంబోలో హారర్ కామెడీ డ్రామాగా ఆ మూవీ రెడీ అవుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న రాజా సాబ్ లో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ తో పాటు రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ సందడి చేయనున్నారు. ఆ ముగ్గురూ రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ లో సందడి చేశారు. అందులో నిధి చాలా అందంగా కనిపించారు.

ఇప్పుడు మేకర్స్ మరో సర్ప్రైజ్ ఇచ్చారు. నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రాజా సాబ్ టీమ్ అందమైన, ప్రతిభావంతులైన నిధి ప్రత్యేక రోజు జరుపుకుంటుందని తెలిపారు. ఆమె పాత్ర కథకు తగ్గ విధంగా క్రియేట్ చేశామని చెప్పారు. హ్యాపీ బర్త్ డే నిధి అంటూ రాసుకొచ్చారు.

అయితే పోస్టర్ లో నిధి అగర్వాల్ చాలా కూల్ గా కనిపించారు. వైట్ కలర్ ఔట్ ఫిట్ లో ఉన్న ఆమె.. క్యాండిల్స్ దగ్గర నిల్చుని ప్రేయర్ చేస్తున్నారు. నవ్వుతూ.. ఏదో చూస్తూ.. హ్యాపీ మూడ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ కొత్త పోస్టర్ ఫుల్ వైరల్ గా మారింది. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పోస్టర్ అదిరిపోయిందని నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. సినిమాలో ఆమె రోల్ కు సరైన ప్రాధాన్యత ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని చెబుతున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి.. ఆమెకు ఖాతాలో సరైన విజయం పడాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు.