వీళ్లు మనుషులా లేక జంతువులా?
ఈ ఇన్సిడెంట్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరుగుతోంది. సింగర్ చిన్మయి లాంటి వాళ్ళు దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
By: M Prashanth | 18 Dec 2025 11:05 AM ISTహైదరాబాద్ లులు మాల్‌లో జరిగిన 'ది రాజా సాబ్' సాంగ్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఒకపక్క ప్రభాస్ సినిమా నుంచి వచ్చిన 'సహానా సహానా' మెలోడీ సాంగ్, నిర్మాత ఇచ్చిన క్రేజీ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మాల్ మొత్తం ప్రభాస్ నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఆ క్రౌడ్ ని, అక్కడి వైబ్ ని చూస్తే సినిమా మీద ఉన్న హైప్ ఏ రేంజ్ లో ఉందో క్లియర్ గా అర్థమైంది.
ఇక్కడి వరకు అంతా సూపర్. కానీ ఈవెంట్ అయిపోయాక చివర్లో జరిగిన ఒక సీన్ మాత్రం షాక్ కు గురి చేస్తోంది. ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఊహించని షాక్ తగిలింది. ప్రోగ్రామ్ అయిపోయాక ఆమె బయటకు వెళ్తుంటే జనం ఒక్కసారిగా మీద పడ్డారు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న క్రౌడ్.. ఆమెను చూడగానే కంట్రోల్ తప్పింది.
సెల్ఫీల కోసం, ఆమెను చూడడం కోసం ఎగబడ్డారు. ఆ తోపులాటలో ఆమె నడవలేక ఇబ్బంది పడటం వీడియోల్లో క్లియర్ గా కనిపిస్తోంది. ఇక కారు ఎక్కాక కూడా జనం వదల్లేదు. అద్దాల మీద పడిపోవడం, కారును చుట్టుముట్టడం చూస్తుంటేనే హారర్ సీన్ ని తలపించింది. ఒక పబ్లిక్ ప్లేస్ లో ఒక స్టార్ హీరోయిన్ కు సేఫ్టీ లేకుండా పోవడం అంటే మామూలు విషయం కాదు.
ఈ ఇన్సిడెంట్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరుగుతోంది. సింగర్ చిన్మయి లాంటి వాళ్ళు దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోలు చూసి "వీళ్లు మనుషులా లేక జంతువులా?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు. నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ టైమ్ లో నిధి అగర్వాల్ ఎంతగా భయపడిపోయి ఉంటారో, ఎంత మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కెమెరా ముందు నవ్వుతూ కనిపించినా, ఇలాంటి చేదు అనుభవాలు వాళ్లను చాలా డిస్టర్బ్ చేస్తాయని నెటిజన్లు అంటున్నారు.
మరికొందరు మరో విధంగా స్పందిస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ బ్లేమ్ చేయాల్సింది ఈవెంట్ ఆర్గనైజర్స్ నే. ప్రభాస్ సినిమా ఈవెంట్ జనం ఏ రేంజ్ లో వస్తారో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. మరి దానికి తగ్గ సెక్యూరిటీ ఏది? మాల్ లాంటి ఓపెన్ ప్లేస్ లో ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు పక్కా ప్లానింగ్ ఉండాలి కదా. కేవలం హైప్ కోసం క్రౌడ్ ని పోగేసి, వచ్చిన గెస్ట్ లకు రక్షణ ఇవ్వలేకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.
బౌన్సర్లు కూడా ఆ జనప్రవాహాన్ని ఆపలేక చాలా కష్టపడ్డారు. నిధి అగర్వాల్ చుట్టూ కనీసం ఒక సేఫ్టీ సర్కిల్ కూడా మెయింటైన్ చేయలేకపోయారు. సెలబ్రిటీలను పిలిచాక వాళ్ళను సేఫ్ గా పంపించాల్సిన బాధ్యత పూర్తిగా మేనేజ్మెంట్ దే. ఇక్కడ వాళ్లు ఘోరంగా ఫెయిల్ అయ్యారని మరికొందరు అంటున్నారు. అయితే ఫ్యాన్స్ బిహేవియర్. అభిమానం ఉండొచ్చు, కానీ అది అవతలి వాళ్లకు నరకం చూపించేలా ఉండకూడదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
