Begin typing your search above and press return to search.

తళుకు బెలుకుల అందాలతో కట్టిపడేస్తున్న నిధి అగర్వాల్!

తెలుగు ,తమిళ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ లలో నిధి అగర్వాల్ కూడా ఒకరు.

By:  Madhu Reddy   |   26 Aug 2025 8:00 AM IST
తళుకు బెలుకుల అందాలతో కట్టిపడేస్తున్న నిధి అగర్వాల్!
X

తెలుగు ,తమిళ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ లలో నిధి అగర్వాల్ కూడా ఒకరు. ఈ అమ్మడు 2017లో వచ్చిన 'మున్నా మైకేల్' అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో 'సవ్యసాచి' అనే చిత్రంతో నాగచైతన్యకు జోడిగా నటించి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో హీరోయిన్ గా భారీ పాపులారిటీ అందుకున్నది. 2021లో తమిళ సినిమా ఈశ్వరన్ తో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ఇటీవల పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటించింది.

అలా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. నిరంతరం అభిమానులను ఖుషీ చేసేలా తన అందచందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తన సినిమా అప్డేట్లనే కాకుండా తనకు సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా తెలియజేస్తూ ఉంటుంది నిధి అగర్వాల్. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా సీతాకోకచిలుక సింబల్ ను జోడించింది. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు నిధి అగర్వాల్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక్కో ఫోటోలో ఒక్కో యాంగిల్ లో ఫోజులిచ్చిన నిధి అగర్వాల్.. మిర్రర్ పొదిగిన డ్రెస్ ధరించి.. తళుకు బెలుకుల అందాలలో పాక్షికంగా ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.. చిన్నటి స్మైల్ తో ఈ ఫోటోలకు మరింత అందాన్ని జోడించండి. నిధి అగర్వాల్ షేర్ చేసిన కొన్ని సెకండ్లలోనే ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈమెతోపాటు మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ కమెడియన్ యోగి బాబు, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కొంత భాగం షూటింగ్ మిగిలి ఉంది.అందుకే డిసెంబర్ 5న విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఖాయమని సమాచారం.

నిధి అగర్వాల్ కెరియర్ విషయానికి వస్తే.. 2014లో యమహా ఫాసినో మిస్ దివా లో ఫైనల్స్ వరకు వచ్చి కిరీటం సొంతం చేసుకోలేకపోయింది. ఇక 2017లో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ అనే సినిమాతో హీరోయిన్ గా తొలిసారి అడుగులు వేసింది. ఇక సినిమాలే కాకుండా పలు మ్యూజిక్ వీడియో లు కూడా చేసింది.