నిధి అగర్వాల్ ఉల్లిపొర చీర దేనికి కౌంటర్?
ఇటీవలే అనుకోకుండా నటుడు శివాజీ `సామాన్లు` అంటూ నటీమణుల ఎక్స్‌పోజింగ్ పై కామెంట్ చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 28 Dec 2025 2:35 PM ISTఇటీవలే అనుకోకుండా నటుడు శివాజీ `సామాన్లు` అంటూ నటీమణుల ఎక్స్‌పోజింగ్ పై కామెంట్ చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు, సామాన్య జనంలోను ఇది డిబేట్ గా మారింది. శివాజీ వ్యాఖ్యలపై విచారణ చేపట్టడమే గాక, పురుషాహంకారంపై చాలా హంగామా సృష్టించారు. శివాజీ వ్యాఖ్యలలో నిధి అగర్వాల్ పేరు కూడా వినిపించడం, ఆ తర్వాత నిధి సోషల్ మీడియాల్లో అతడి వ్యాఖ్యలకు నర్మగర్భంగా కౌంటర్ వేయడం తెలిసినదే.
అయితే అతడికి కౌంటర్ వేసిన తర్వాత మొదటిసారి నిధి అగర్వాల్ ఒక ఫిల్మీ వేదికపై ప్రత్యక్షమైంది. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ప్రీరిలీజ్ వేడుకలో నిధి సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. నిధి అగర్వాల్ ఈ వేదిక కోసం అందమైన చీరను ధరించింది. పాక్షికంగా అందాలను ఎలివేట్ చేసే ఉల్లిపొర చీరలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. అయితే నిధి ఇలా బోల్డ్ అవతార్ లో కనిపించడానికి కారణం, నిజానికి `శివాజీ`కి కౌంటర్ అని కొందరు నెటిజనులు భావిస్తున్నారు.
నిధి వేషధారణపై మరోసారి నెటిజనుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే గ్లామర్ ఇండస్ట్రీలో ఆమాత్రం గ్లామర్ ఎలివేషన్ సర్వసాధారణం అని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ ఎలివేషన్ లేనిదే నటీమణులను ఎవరు పట్టించుకుంటారు? అనే కోణాన్ని కూడా చాలా మంది పరిశీలిస్తున్నారు. పద్ధతిగా చీర కట్టుకుని, ఒంటినిండా ఆభరణాలు ధరించి, పవిట కొంగు కప్పుకోవడానికి ఇదేమైనా ఆభారణాల షోరూమ్ ప్రకటన కాదు కదా! అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇంతకుముందు నిధి అగర్వాల్ కొన్ని వాణిజ్య ప్రకటనల్లో ఎంతో పద్ధతిగా చీరకట్టులో సాంప్రదాయబద్ధంగా కనిపించిన వీడియోలు కూడా ఇప్పుడు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి.
ది రాజా సాబ్ వేడుక కోసం నిధి అగర్వాల్ వేషధారణ సరైనదేనా? ఇలా గ్లామరస్ గా కనిపిస్తే తప్పేంటి? దీనిపై మీ వ్యాఖ్యలు ఏమిటో చెప్పండి! అంటూ ఆన్ లైన్ లో డిబేట్లు కూడా మొదలైపోయాయి. ప్రస్తుతం నిధి అగర్వాల్ తన చిత్రం ది రాజా సాబ్ విజయం కోసం ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంది. తనను నమ్మి అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతగా ప్రచార సాయానికి వెనకాడటం లేదు. నిధి తన క్రమశిక్షణతో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. `ది రాజా సాబ్` జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే, నిధి కెరీర్ కి అదనపు బూస్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
