ఆ మాట ఎప్పటికీ మరువలేనిది..
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ది రాజా సాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది.
By: Madhu Reddy | 27 Dec 2025 6:26 PM ISTప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ది రాజా సాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నారు.
మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొంటున్న నిధి అగర్వాల్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే ది రాజా సాబ్ సినిమా విశేషాలు కూడా పంచుకోవడం గమనార్హం. ది రాజా సాబ్ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ముఖ్యంగా ఇందులో ప్రతి ఒక్కరి పాత్రకు ప్రాధాన్యత ఇచ్చారు. అటు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన చాలా మంచి వ్యక్తి. నా కెరియర్ లో ఇప్పటివరకు అంత మంచి వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ముఖ్యంగా ఆయన అతిధి మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంటి నుంచే భోజనం తెప్పిస్తారు.
ఆయన హైట్ ను ఈ సినిమాలో నేను బ్యాలెన్స్ చేయడానికి పెద్ద హీల్స్ వేసుకొని.. యాపిల్ బాక్సులపై నిలబడి మరీ సహానా పాటను షూట్ చేశాము. ఈ పాట చాలా కొత్తగా ఉంటుంది. కాస్ట్యూమ్స్ కూడా కలర్ ఫుల్ గా ఉంటాయి అంటూ తెలిపింది.
అలాగే ఆమె మాట్లాడుతూ.. ది రాజా సాబ్ సినిమా విడుదల అయిన తర్వాత నా అప్కమింగ్ ప్రాజెక్టుల గురించి ప్రకటిస్తాను. 2026 మొత్తం నేను బిజీగానే ఉండబోతున్నాను. చాలా భాషలలో సినిమాలు చేస్తున్నాను. అటు తెలుగులో కూడా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అంటూ తెలిపింది. ఇకపోతే ఈ ఏడాది ది రాజాసాబ్ షూటింగ్ తో పాటు హరిహర వీరమల్లు సినిమా ప్రమోషనల్ సమయంలో పవన్ కళ్యాణ్ తనను ప్రశంసించడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.
మున్నా మైకేల్ అనే సినిమాతో హిందీ రంగ ప్రవేశం చేసిన నిధి అగర్వాల్ ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ అంటూ పలు చిత్రాలు చేసిన ఈమె.. తమిళంలో కూడా మూడు చిత్రాలు చేసింది. ఇకపోతే ఇస్మార్ట్ శంకర్ తోనే మంచి ఇమేజ్ అందుకున్న ఈమె హరిహర వీరమల్లు సినిమాలో పంచమి పాత్రతో మెప్పించింది. ఇప్పుడు రాజా సాబ్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా తర్వాత మరిన్ని ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నాయని చెబుతోంది.. మరి ఆ ప్రాజెక్టులు ఏంటి? ఈమె కెరియర్ కు అవి ఏ విధంగా దోహదపడతాయి? అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఏడాది హరిహర వీరమల్లుతో పలకరించిన ఈమె.. వచ్చే ఏడాది మరెన్ని చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
