Begin typing your search above and press return to search.

ఇది ఏఐ కాదు.. ప్రభాస్ గురించి నిధి అగర్వాల్..!

అయితే “This is not AI” అనే క్యాప్షన్ కొంత గందరగోళాన్ని కూడా సృష్టించింది. ఈ మధ్యకాలంలో ఏఐతో తయారైన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   5 Jan 2026 12:39 AM IST
ఇది ఏఐ కాదు.. ప్రభాస్ గురించి నిధి అగర్వాల్..!
X

రాజా షాబ్ సినిమాతో మన ముందుకు రాబోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోలో ఇద్దరూ క్యూట్‌గా ఫింగర్-హార్ట్ (ఫింగర్ లవ్) సింబల్ చూపిస్తూ నవ్వుతూ కనిపించారు. ఫోటో షేర్ చేసిన నిధి.. దానికి “This is not AI” అనే చిన్న కానీ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టింది. వెంటనే ఈ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.





నిధి అగర్వాల్ త్వరలో ప్రభాస్ సరసన ది రాజా సాబ్ సినిమాలో నటించనుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోటో రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ ఫోటోలో ఇద్దరూ చాలా రిలాక్స్‌డ్‌గా.. హ్యాపీగా కనిపించడం అభిమానులకు బాగా నచ్చింది. షూటింగ్ సమయంలో తీసిన ఓ స్పెషల్ మూమెంట్‌లా ఈ ఫోటో ఉందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

అయితే “This is not AI” అనే క్యాప్షన్ కొంత గందరగోళాన్ని కూడా సృష్టించింది. ఈ మధ్యకాలంలో ఏఐతో తయారైన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఇది నిజమైన ఫోటోనా? లేక ఎడిట్ చేశారా? అనే సందేహం అభిమానుల్లో కలిగింది. కొంతమంది ఇది ఖచ్చితంగా రియల్ ఫోటోనే అంటుంటే.. మరికొందరు ఇంకా డౌట్ పడుతున్నారు. సోషల్ మీడియాలో “ఇప్పుడు నిజం, ఏఐ ఏదో గుర్తించడం చాలా కష్టం” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ వైరల్ ఫోటోకే కాకుండా..నిధి అగర్వాల్ ఇటీవల ప్రభాస్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పింది. షూటింగ్ సమయంలో ప్రభాస్ చాలా క్రమశిక్షణతో ఉంటారని ఆమె వెల్లడించింది. ముఖ్యంగా ఆయన ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పింది. పండ్లు, ఆరోగ్యకరమైన ఆహారమే ఎక్కువగా తింటారని.. అనారోగ్యకరమైన ఫుడ్‌ను పూర్తిగా దూరంగా ఉంచుతారని నిధి తెలిపింది.