ఇస్మార్ట్ బ్యూటీ బ్యాడ్ లక్ అంటే ఇదే..!
ఐతే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా కోసం అంత ఎఫర్ట్ పెట్టిన నిధికి ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.
By: Ramesh Boddu | 15 Sept 2025 10:19 AM ISTఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ బ్యాడ్ లక్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. గల్లా అశోక్ తో హీరో సినిమా చేసిన తర్వాత టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చింది అమ్మడు. ఐతే నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉన్న హరి హర వీరమల్లు సినిమాతో సర్ ప్రైజ్ చేసింది నిధి అగర్వాల్. ఆ సినిమాలో పంచమి రోల్ లో నటించిన నిధి సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్నది. ఐతే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా కోసం అంత ఎఫర్ట్ పెట్టిన నిధికి ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.
నిధి కెరీర్ డిసైడ్ చేసే ఛాన్స్..
ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది నిధి అగర్వాల్. ఆ సినిమాలో నిధితో పాటు మాళవిక మోహనన్ కూడా నటిస్తుంది. నిధి అగర్వాల్ కి అయితే రాజా సాబ్ రిజల్ట్ తన కెరీర్ ని డిసైడ్ చేస్తుంది. ఐతే రాజా సాబ్ సినిమా కన్నా ముందు లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ మిరాయ్ లో నిధి ఒక స్పెషల్ సాంగ్ చేసింది. బ్యాడ్ లక్ ఏంటంటే సినిమా ఫ్లోకి అడ్డొస్తుందని దాన్ని ట్రిం చేసేశారు మేకర్స్.
మిరాయ్ లో నిధి అగర్వాల్ సాంగ్ ఉంది అన్న లీక్ కూడా బయటకు రాలేదు. అలా థియేటర్ లో సర్ ప్రైజ్ చేద్దామని అనుకున్నారు. నిధి కూడా ఈ సాంగ్ తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని ఆశపడింది. కానీ సినిమాలో సాంగ్ మిస్ అయ్యిందని తెలిసి అప్సెట్ అయ్యింది. అంతేకాదు సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అర్రెర్ ఒక సూపర్ హిట్ సినిమాలో తన సాంగ్ లేకుండా పోయిందే అని ఫీల్ అవుతుంది.
కార్తీక్ మెగా 158 సినిమా..
డైరెక్టర్ కార్తీక్ ని నిధి సాంగ్ గురించి అడిగితే అది పార్ట్ 2 లో పెడతామని అంటున్నాడు. ఐతే మిరాయ్ 2 అంటే అది ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు. తేజ సజ్జ మిరాయ్ తర్వాత జాంబి రెడ్డి 2 చేసాడట. అది కూడా పీపుల్ మీడియా నిర్మిస్తుంది. మరోపక్క కార్తీక్ మెగా 158 సినిమా చేస్తున్నాడు. అంటే ఆ సినిమాను బాబీ డైరెక్ట్ చేస్తుంటే కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
సో తేజ, కార్తీక్ ఇద్దరు తాము కమిటైన సినిమాలు పూర్తి చేసుకుని వచ్చాక మిరాయ్ 2 చేసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా మిరాయ్ 2 వస్తే మరో లెవెల్ అనిపిస్తుంది. మరి అందులో అయినా నిధి సాంగ్ ఉంటుందా లేదా అసలకే ఎత్తేస్తారా అన్నది చూడాలి. సినిమాలో లేకపోయినా సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని నిధి అగర్వాల్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
