బ్లాక్ డ్రెస్‌లో 'రాజాసాబ్' బ్యూటీ.. గ్లామర్ హీట్ మామూలుగా లేదుగా..
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాస్ ఆడియెన్స్‌ను తన గ్లామర్‌తో కట్టిపడేసిన బ్యూటీ నిధి అగర్వాల్. వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారు.
By: M Prashanth | 2 Jan 2026 11:38 PM IST'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాస్ ఆడియెన్స్‌ను తన గ్లామర్‌తో కట్టిపడేసిన బ్యూటీ నిధి అగర్వాల్. వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహల్వాని డిజైన్ చేసిన బ్లాక్ అవుట్‌ఫిట్‌లో నిధి అగర్వాల్ స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు.
ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో నిధి నలుపు రంగు డ్రెస్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చారు. ముఖ్యంగా ఆ డ్రెస్‌కు ఉన్న కోర్సెట్ స్టైల్ బ్లౌజ్, దానిపై ఉన్న మెరిసే వర్క్ ఆమె గ్లామర్‌ను రెట్టింపు చేసింది. మోడ్రన్ గౌన్లా ఉన్న ఈ డ్రెస్ డిజైన్ ఆమె పర్ఫెక్ట్ గ్లామర్ ను ఎలివేట్ చేస్తోంది. స్టైలింగ్ విషయంలోనూ నిధి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హెవీ జ్యువెలరీ జోలికి వెళ్లకుండా, కేవలం నలుపు రంగు హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ధరించి చాలా క్లాసీగా రెడీ అయ్యారు.
జుట్టును లూజ్‌గా వదిలేసి, మినిమల్ మేకప్‌తో తన న్యాచురల్ అందాన్ని హైలైట్ చేశారు. కెమెరా వైపు ఆమె చూస్తున్న తీరు, ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే 'పర్ఫెక్ట్' లుక్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే, గత ఏడాది నిధి అగర్వాల్ 'హరిహర వీరమల్లు' సినిమాలో కనిపించారు. పవన్ కళ్యాణ్ సరసన నటించినా, భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఆ సినిమా ఫలితం కాస్త నిరాశపరిచినా, నిధి మాత్రం తన తదుపరి ప్రాజెక్టులపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ ఆమె ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాపైనే నిధి భారీ ఆశలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కావడంతో, ఇది కచ్చితంగా తన కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం నిధి క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో 'రాజాసాబ్'తో ఆమె ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
