గ్లామర్‌తో కట్టేసిన నిధి అగర్వాల్: ఫ్లాపుల్లోనూ తగ్గని 'ఇస్మార్ట్' క్రేజ్
ఈ యంగ్ బ్యూటీ ఫోటోలను షేర్ చేసిన కేవలం 4 గంటల వ్యవధిలోనే లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.
By: Sivaji Kontham | 11 July 2026 8:00 AM ISTఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బ్లాక్ అవుట్‌ఫిట్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. నలుపు రంగు దుస్తులలో నిధి ఒలకబోసిన అందాలు.. తన ఇంటెన్స్ లుక్స్ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతున్నాయి. ఈ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలతో నిధి అగర్వాల్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
ఈ యంగ్ బ్యూటీ ఫోటోలను షేర్ చేసిన కేవలం 4 గంటల వ్యవధిలోనే లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. నిధి అందానికి ఫిదా అయిన నెటిజన్లు, అభిమానులు హార్ట్- బ్లాక్ హార్ట్- ఫైర్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్‌ను పూర్తిగా నింపేస్తున్నారు. జార్జియస్ (అద్భుతంగా ఉన్నావు), `బ్యూటిఫుల్ బ్లాక్ క్వీన్` అంటూ నెటిజన్లు నిధి రూపానికి మురిసిపోతూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌పై క్షణాల్లో వైరల్‌గా మారాయి.
నిజానికి నిధి అగర్వాల్ కెరీర్ పరంగా ఇటీవల కాలం పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ డ్రామా.. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ప్రతిష్టాత్మక చిత్రం `హరి హర వీర మల్లు`తో పాటు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన `రాజా సాబ్` చిత్రాల్లో నిధి కథానాయికగా మెరిసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసి..ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాపులుగా నిలిచాయి.
అయితే బాక్సాఫీస్ వద్ద వరుసగా రెండు భారీ డిజాస్టర్లు పడినప్పటికీ నిధి అగర్వాల్ కెరీర్‌కు మాత్రం ఎలాంటి డోఖా లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ఫ్లాప్ ఎఫెక్ట్ హీరోయిన్లపై పడుతుంది.. కానీ నిధి విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. గ్లామర్ ప్రపంచంలో తనకున్న క్రేజ్, యూత్ ఫాలోయింగ్ కారణంగా ఇప్పటికీ పలు నిర్మాణ సంస్థలు, దర్శకులు తన వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా నిధి బ్రాండ్ వాల్యూ అలాగే స్థిరంగా కొనసాగుతోంది.
ఇక 2026-27 సీజన్‌లో నిధి అగర్వాల్ తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. భారీ డిజాస్టర్ల తర్వాత కొత్తగా ఏ తెలుగు సినిమాకు లేదా వెబ్ సిరీస్‌లకు అధికారికంగా సంతకాలు చేయలేదు. కథల ఎంపికలో ఈసారి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో కాస్త గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టుల కథా చర్చలు నడుస్తుండగా... త్వరలోనే తన కొత్త సినిమాల వివరాలను ప్రకటించే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి.
