Begin typing your search above and press return to search.

ఏంటీ.. నిధి అగర్వాల్ కి అంత చిన్న చెల్లెలు ఉందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   22 Jan 2026 1:56 PM IST
ఏంటీ.. నిధి అగర్వాల్ కి అంత చిన్న చెల్లెలు ఉందా?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత ఏడాది పవన్ కళ్యాణ్ తో 'హరిహర వీరమల్లు' సినిమా చేసి మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న ఈమె.. ఈ ఏడాది మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'ది రాజాసాబ్' సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులలో బిజీగా ఉన్న నిధి అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. తనకు ఒక చెల్లెలు ఉంది అని , అయితే తనకంటే ఏకంగా ఏడేళ్లు ఆ అమ్మాయి చిన్నది అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది నిధి అగర్వాల్.

ఇంటర్వ్యూలో భాగంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ.." నాకు చిన్నప్పటి నుంచి పిల్లలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాను..కనీసం నాకొక నలుగురు పిల్లలు అయినా కావాలి. ఒక టైంలో పెళ్లి కంటే ముందు సుస్మిత సేన్ లాగా నేను కూడా పిల్లల్ని దత్తత తీసుకోవాలి అనుకున్నాను. అయితే పిల్లల్ని పెంచాలంటే మనం ఇంకో ప్రపంచంలోకి వెళ్లాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడదు. అయితే పిల్లలపై నాకు ఇలా ప్రేమ పెరగడానికి కారణం నా చెల్లెలు. ఆమె నాకంటే ఏడేళ్లు చిన్నది. తనను నేను చెల్లెలిగా కాకుండా నా కూతురిలా చూసుకుంటున్నాను.

నిజానికి నా తల్లిదండ్రులు ఒక పాప చాలని.. నాతోనే పిల్లల్ని ఆపేద్దామని అనుకున్నారట. అయితే నాకు ఒక చెల్లెలు కావాలి అంటూ చిన్నప్పుడు నేను దేవుడికి ఉత్తరం రాసి మరీ పూజ గదిలో పెట్టేదాన్ని. ప్రతిరోజు దేవుడు ముందు ఆ ఉత్తరం పెట్టడం తో ఎట్టకేలకు దేవుడు నా మొర ఆలకించాడు. అందుకే నేను పుట్టిన ఏడేళ్ల తర్వాత నాకు చెల్లెలు పుట్టింది" అంటూ తెలిపింది. మొత్తానికైతే తనకు తన చెల్లెలిపై ఉన్న ప్రేమను.. అలాగే తనకు తన చెల్లెలికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ను తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది నిధి అగర్వాల్. ప్రస్తుతం నిధి అగర్వాల్ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నిధి అగర్వాల్ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె.. కథక్ , బెల్లి డాన్స్ లలో శిక్షణ పొందింది. సవ్యసాచి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది నిధి అగర్వాల్. ఇక ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ మొన్నటి వరకు తనకు ఉన్న తాగుడు అలవాటును బయటపెట్టిన ఈమె.. ఇప్పుడు ఇలా పిల్లలపై ప్రేమను కూడా బయటపెట్టింది. అంతేకాదు తన చెల్లెలికి తనకి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.