విదేశాల్లో షూటింగ్ అప్పుడు నిధి ఏం చేస్తుందంటే?
సౌత్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న సినిమా ది రాజా సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Jan 2026 11:00 PM ISTసౌత్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న సినిమా ది రాజా సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. కామెడీ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నిధి అగర్వాల్ తో పాటూ మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజా సాబ్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న నిధి
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే మీడియా ముందుకొచ్చి రాజా సాబ్ ను తెగ ప్రమోట్ చేస్తున్నారు నిధి. అయితే ప్రస్తుతం నిధి పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. రాజా సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న నిధి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు.
విదేశాలకు వెళ్లినప్పుడు నేనే వండుకుంటా
తాను షూటింగ్ కోసం గ్రీస్ వెళ్లినప్పుడు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ కోసం సొంత గ్యాస్ సిలిండర్, పాన్, కిరాణా సామాగ్రిని తీసుకెళ్తానని, బయటకు వెళ్లినప్పుడు హెల్తీ ఫుడ్ కావాలంటే ఇవి తప్పవని, అన్నీ తీసుకెళ్లి తానే సొంతంగా వండుకుని బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ హెల్తీగా తింటానని నిధి చెప్పుకొచ్చారు. విదేశాలకు వెళ్లినప్పుడు తాను ఫుడ్ గా బ్రెడ్, అవకాడో, ఎగ్స్ ఎక్కువగా తీసుకుంటానని నిధి తెలిపారు.
షూటింగ్ కు ఇబ్బంది రాకూడదనే..
బయటకు వెళ్లినప్పుడు హెల్తీ ఫుడ్ తినకపోతే ఆరోగ్యం పాడవుతుందని, అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు తానే మంచి ఫుడ్ ను వండుకుని తింటానని, షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకే తాను ఇలా సెటప్ చేసుకున్నట్టు నిధి చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇది మంచి ఐడియా అని, ఎవరికైనా నచ్చితే ఫాలో అవొచ్చని కూడా ఆమె తెలిపారు.
ప్రభాస్ ట్రూ డార్లింగ్
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ, ఆయన ట్రూ డార్లింగ్ అని, చాలా కైండ్, రియల్లీ టాలెంటెడ్ అని, చాలా హంబుల్ మరియు ఎంతో అద్భుతమైన వ్యక్తి అని నిధి చెప్పుకొచ్చారు. ఇక నిధి విషయానికొస్తే ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అమ్మడు రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా తనకు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం నిధి ఆశలన్నీ రాజా సాబ్ పైనే ఉన్నాయి.
