పర్ఫెక్ట్ ఫ్యామిలీమ్యాన్ అంటే ఈయనే సుమీ
నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రా, కూతురు మాల్తీ మేరీలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
By: Sivaji Kontham | 15 Jan 2026 11:11 PM ISTనిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రా, కూతురు మాల్తీ మేరీలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అతడిని నెటిజనులు `పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్` అని ఎందుకు పిలుస్తారో చెప్పే కొన్ని ముచ్చట్లు ఇవి.
జనవరి 15 మాల్తీ మేరీ 4వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఫ్యామిలీ టర్క్స్ అండ్ కైకోస్ దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ తీసుకున్న ఫోటోలను నిక్ `స్వర్గంలో ఫ్యామిలీ టైమ్ గొప్పతనం!` అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. వీటిలో తండ్రి-కూతుళ్ల ఫోటో అన్నిటి కంటే ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక ఫోటోలో ప్రియాంక పూల్‌లో స్టైలిష్‌గా ఫోజులిస్తుంటే, నిక్ తనను ఫోటో తీస్తున్నారు. ఆ సమయంలో చిన్నారి మాల్తీ తండ్రి ఒడిలో కూర్చుని తన అమ్మ ఫోటో షూట్ పూర్తయ్యే వరకు ఎంతో ఓపికగా ఎదురుచూడటం అందరినీ ఆకట్టుకుంది.
ప్రియాంక ఎక్కడికి వెళ్లినా తన కోసం పర్ఫెక్ట్ ఫోటోలు తీసిపెట్టడంలో నిక్ ఎప్పుడూ ముందుంటారు. అతడు మంచి భర్త మాత్రమే కాదు, కూతురిని క్షణమైనా వీడి ఉండలేడు. వెకేషన్‌లో మాల్తీని ఎత్తుకుని తిరగడం, తనతో కలిసి పూల్‌లో ఆడుకోవడం వంటి దృశ్యాలు ఆయనకు తన కుటుంబంపై ఉన్న ప్రేమను చాటి చెబుతున్నాయి. ఈ వెకేషన్‌కు ముందు జనవరి 11న జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ 2026 రెడ్ కార్పెట్ మీద కూడా ఈ జంట తమ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రియాంక కెరీర్ జర్నీ..
వెకేషన్ తర్వాత ప్రియాంక తన తదుపరి చిత్రం `ది బ్లఫ్` ప్రమోషన్లలో బిజీ కానున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. మరోవైపు ప్రియాంక తదపరి రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న `వారణాసి` సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొనాల్సి ఉంది. బిజీ షెడ్యూళ్ల నడుమ పండగ బ్రేక్ లో ఇలా పీసీ ఫ్యామిలీ వెకేషన్ ని ఆస్వాధించింది.
