Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ పెళ్లి.. త‌మ్ముడికి అన్న‌య్య కానుక‌!

అల్లు శిరీష్ - నైనిక రెడ్డిల వివాహ వేడుకకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

By:  Sivaji Kontham   |   7 March 2026 9:50 AM IST
అల్లు శిరీష్ పెళ్లి.. త‌మ్ముడికి అన్న‌య్య కానుక‌!
X

అల్లు శిరీష్ - నైనిక రెడ్డిల వివాహ వేడుకకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన తమ్ముడు శిరీష్ పెళ్లి కానుకగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక ఖరీదైన లగ్జరీ కార్‌ను బహుమతిగా ఇచ్చారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అన్నదమ్ముల మధ్య ఉన్న గాఢమైన అనుబంధానికి ఈ కానుక ఒక నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా అల్లు అర్జున్ ఇంటి వద్ద ఒక ఖరీదైన బ్లాక్ కలర్ లగ్జరీ కార్‌ను షోరూమ్ ప్రతినిధులు కంటైనర్ నుండి దించుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఇది క‌చ్చితంగా తమ్ముడు శిరీష్ కోసమే తెప్పించిన కానుక అని భావిస్తున్నారు. అయితే అది అల్లు అర్జున్ తన సొంత గ్యారేజీ కోసం తెప్పించుకున్న కొత్త కారా? లేక నిజంగానే శిరీష్‌కు పెళ్లి కానుకగా ఇచ్చేందుకే తెప్పించారా? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంపై బన్నీ నుండి స్పష్టత వస్తుందేమోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి వేడుకకు తరలివచ్చిన అతిథులు కూడా నూతన దంపతులకు పలు విలువైన కానుకలను అందజేసినట్లు సమాచారం. అల్లు - మెగా కుటుంబాలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ స్థాయికి తగ్గట్లుగా అరుదైన బహుమతులను పంపినట్లు తెలుస్తోంది. కేవలం వస్తువులే కాకుండా.. కుటుంబ సభ్యుల ఆశీర్వచనాలు ఈ వేడుకలో అత్యంత విలువైన కానుకలుగా నిలిచాయి.

టాలీవుడ్‌లో ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న అల్లు శిరీష్ ఒక ఇంటివాడు కావడం.. అది కూడా తన అన్న అల్లు అర్జున్ పర్యవేక్షణలో ఇంత ఘనంగా జరగడం చర్చనీయాంశమైంది. ఈ లగ్జరీ కార్ గిఫ్ట్ వార్త నిజమైతే.. అది క‌చ్చితంగా శిరీష్ పెళ్లిలో హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మెగా-అల్లు అభిమానులు ఈ కొత్త కార్ వీడియోను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు శిరీష్ - నైనిక రెడ్డిల వైభవ వివాహం:

అల్లు శిరీష్ - నైనిక రెడ్డిల వివాహం 6 మార్చి 2026న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. మెగా- అల్లు కుటుంబాలకు టాలీవుడ్‌లో ఉన్న ప్రత్యేక స్థానం , సాన్నిహిత్యం కారణంగా ఈ వేడుక ఒక వేడుకలా కాకుండా ఒక పండుగలా సాగింది. చిత్ర పరిశ్రమలోని అగ్ర తారలందరూ ఒకే చోట చేరి నూతన దంపతులను ఆశీర్వదించడంతో వివాహ వేదిక కళకళలాడింది.

ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు కేవలం సినీ ప్రముఖులే కాకుండా.. ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు , ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా భారీగా తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి దిగ్గజాలతో పాటు ఇతర రంగాల ప్రముఖుల సందడితో ఈ వివాహ వేడుక 2026లోనే అత్యంత మరపురాని ఈవెంట్ గా నిలిచిపోయింది.