ఆ ముగ్గురి మధ్య స్టార్ ఇమేజ్ కాంపిటీషన్!
రష్మికా మందన్నా, సమంతా, కీర్తి సురేష్, సాయి పల్లవి, శ్రీలీల లాంటి స్టార్ భామలంతా బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టారు.
By: Srikanth Kontham | 30 Sept 2025 9:43 AM ISTరష్మికా మందన్నా, సమంతా, కీర్తి సురేష్, సాయి పల్లవి, శ్రీలీల లాంటి స్టార్ భామలంతా బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టారు. అక్కడ అవకాశాలు అందుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తెలుగులో వస్తోన్న మీడియం అవకాశాలను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. సీనియర్ నటి అనుష్క శెట్టి ఉన్నా? సెలక్టివ్ గా వెళ్తోంది. టాలీవుడ్ కి కొత్తగా వస్తోన్న వారంతా ఒకటి రెండు సినిమాలకే పరిమితమవుతున్నారు. అందం, అభినయం ఉన్నా? అదృష్టం కలిసి రాక వెనుకబడిన వారు మరికొంత మంది. దీంతో ఇప్పుడు ఓ ముగ్గురు భామల మధ్య స్టార్ ఇమేజ్ పోటీ నెలకొంది.
వాళ్ల కోసం యంగ్ హీరోలు:
మమితా బైజు, కయాదు లోహార్, భాగ్య శ్రీ బోర్సే లు టాలీవుడ్ కి కీలకంగా మారారు. దీంతో ముగ్గురి మధ్య కాస్త పోటీ కనిపిస్తోంది. మమితా బైజు కోలీవుడ్ లో నాలుగైదు సినిమాలు చేస్తోంది. తెలుగులో సూర్య నటిస్తోన్న 46వ చిఇత్రంతో లాంచ్ అవుతోంది. కానీ ప్రవేశానికి ముందే అమ్మడిపై టాలీవుడ్ అంచనాలు భారీగా ఉన్నాయి. సోషల్ మీడియా ఫాలోయింగ్ తో సొగసరి టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారింది. యువతను ఆకర్షించడంలో సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. దీంతో బ్యూటీ సరసన నటించడానికి నవతరం హీరోలు ముందుకొస్తున్నారు.
ఇండస్ట్రీలో త్రీ స్టార్స్:
అస్సాం బ్యూటీ కయాదు లోహార్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. డ్రాగన్ అనే యూత్ పుల్ కాన్సెప్ట్ తో తెలుగు యువతలో పాపులర్ బ్యూటీగా మారిపోయింది. అనువాద చిత్రమే అద్భుతమైన విజయాన్ని అందించడంతో పాటు గ్లామర్ అప్పి రియన్స్ స్టార్ హీరోలకే ప్రమోట్ అయింది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న ప్యారడైజ్ లో ఛాన్స్ అందుకుందని సమాచారం. కొన్ని కొత్త అవకాశాలు క్యూ లో ఉన్నాయన్నది నెట్టింట జోరుగా సాగుతోన్న చర్చ. `మిస్టర్ బచ్చన్` అనే ప్లాప్ చిత్రంతో పరిచయమైన మరో బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే. ఇటీవలే రిలీజ్ అయిన `కింగ్ డమ్` లోనూ మెరిసింది.
విజయాలతో పనిలేకుండా:
ఈ రెండు చిత్రాల్లో నటకు పెద్దగా ఆస్కారం లేని పాత్రలు పోషించినా భాగ్య శ్రీ అంటే టాలీవుడ్ లో ఓ వైబ్ క్రియేట్ అవుతుంది. స్టార్ హీరోలతో అవకాశాల రేసులోనూ ఈ భామ పేరు జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ ముగ్గురు మరింత బిజీగా మారే అవకాశం ఉంది. అదే జరిగితే స్టార్ ఈ ముగ్గురి మధ్య స్టార్ ఇమేజ్ అనే పోరు తప్పదు. ఇక్కడ ఛాన్సులందుకోవడం ఒక్కటే గొప్ప కాదు. ఆ ఇమేజ్ ను కాపాడుకున్న వాళ్లు గొప్ప. అలా కొనసాగిన భామలకు హిట్లతో పని లేకుండానే ఛాన్సులు అందుకోగల్గుతున్నారు.
