Begin typing your search above and press return to search.

కొత్త కొత్త‌గా ట్రై చేస్తోన్న నయా స్టార్లు!

ఇండ‌స్ట్రీలో ఎక్స్ పెక్టెడ్ కాంబినేష‌న్స్ అంటూ కొన్ని ఉంటాయి. క‌చ్చితంగా ఆ హీరో-డైరెక్ట‌ర్ ఏదో స‌మ‌యంలో క‌లిసి ప‌ని చేస్తార‌ని ఊహిస్తారు.

By:  Srikanth Kontham   |   16 Feb 2026 10:00 PM IST
కొత్త కొత్త‌గా ట్రై చేస్తోన్న నయా స్టార్లు!
X

ఇండ‌స్ట్రీలో ఎక్స్ పెక్టెడ్ కాంబినేష‌న్స్ అంటూ కొన్ని ఉంటాయి. క‌చ్చితంగా ఆ హీరో-డైరెక్ట‌ర్ ఏదో స‌మ‌యంలో క‌లిసి ప‌ని చేస్తార‌ని ఊహిస్తారు. అలాగే క‌ల‌వ‌ని క‌ల‌యిక‌లు కూడా కొన్ని ఉంటాయ‌ని ఊహ‌కి వ‌స్తుంటాయి. కానీ అలాంటి కాంబినేష‌న్స్ సెట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తాజాగా కొన్ని కాంబినేష‌న్లు చూస్తే? క్రేజీగా అనిపిస్తుంది. ఓ సారి కొత్త కాంబినేష‌న్స్ ను వెరిఫై చేస్తే స‌రి. యూత్ స్టార్ నితిన్ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల్ని లైన్ లో పెట్టాడు. కొంత కాలంగా చేస్తోన్న సినిమాలేవి ఆశించిన ఫ‌లితాలివ్వ‌డం లేదు. ఎన్ని ప్ర‌యోగాలు చేస్తున్నా నిరాశ త‌ప్ప ఉత్సాహం క‌నిపించ‌లేదు.

దీంతో నితిన్ పంథా మార్చాడు. పూర్తిగా భిన్న‌మైన క‌థ‌ల వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో వి. ఐనాంద్ తో ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా ఉంటుంద‌ని ఎక్క‌డా వార్త కూడా బ‌య‌ట‌కు రాకుండా సెట్ అయిన కాంబినేష‌న్ ఇది. అలాగే అంజి అనే కొత్త కుర్రాడితోనూ నితిన్ ప్రాజెక్ట్ ఒక‌టుంటుంది.

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య 25 వ ప్రాజెక్ట్ కోసం ఎంతో మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు. రెండు విజ‌యాలు అందించిన శివ నిర్వాణ కూడా చైత‌న్య తో ఆ ప్రాజెక్ట్ చేయాల‌నుకున్నాడు. కానీ చై మాత్రం వారంద‌న్నీ ప‌క్క‌న‌బెట్టి `బెదురులంక` ఫేం క్లాక్స్ ని తెర‌పైకి తెచ్చాడు.

ఈ క‌ల‌యిక‌లో ఓ సినిమా ఉంటుంద‌ని అక్కినేని ఫ్యామిలీ కూడా ఊహించి ఉండ‌దు. అలాగే మెగా మేన‌ల్లుడు సాయితేజ్ కూడా `క‌` మేక‌ర్స్ ద్వ‌యాన్ని లైన్ లో పెట్టాడు. `విరూపాక్ష` త‌ర్వాత క‌థ‌ల‌పై సాయితేజ్ కు మంచి ఐడియా ఏర్ప‌డుతుంది. ఎలాంటి సినిమాలు సక్సెస్ అవుతున్నాయి? అన్న‌ది చాలా క్లోజ్ గా స్ట‌డీ చేస్తున్నాడు. అందులో భాగంగానే `క‌` మేక‌ర్స్ తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా విక్ర‌మ్. కె.కుమార్ ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. సాధార‌ణంగా విక్ర‌మ్ హీరోలు చాలా సెల‌క్టివ్ గా ఉంటారు.

ఎవ‌రితో ప‌డితే వారితో విక్రమ్ ప‌నిచేయ‌డు. త‌న ఆలోచ‌న‌ల‌కు...విజ‌న్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్న న‌టుల్నే ఎంచుకుంటాడు. అలా స‌రితూగ‌క‌పోతే ప్రాజెక్ట్ అయినా వ‌దులుకుంటాడు గానీ రాజీ ప‌డ‌డు. అలాంటి విక్ర‌మ్ క‌ళ్ల‌లో దేవ‌ర‌కొండ ప‌డ‌టం ఇంట్రెస్టింగ్. ఈనేప‌థ్యంలో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఎలాంటి సినిమా వ‌స్తుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంకా ఇలాంటి ఊహించ‌ని కాంబినేష‌న్లు మ‌రిన్ని సెట్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంది. స్టార్ హీరోలు కూడా ఎంతో ఇన్నోవేటివ్ గా ఉంటున్నారు. ఒక‌ప్పుడు క‌మ‌ర్శియ‌ల్ క‌థ‌ల‌కే ప్రాధాన్య‌త ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాటిని ప‌క్క‌న‌బెట్టి ఇన్నోవేటివ్ గా ఉన్న డైరెక్ట‌ర్ల‌కే ఛాన్సులిస్తున్నారు.