Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌వ‌శ‌కం మేక‌ర్స్‌!

వీరికి ముందు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగిన మేక‌ర్స్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సురేష్ బాబు, గీతా ఆర్ట్స్ అల్లు అర‌వింద్ సైలెంట్ అయిపోయారు.

By:  Ravindar Gorantla   |   17 Feb 2026 4:00 PM IST
టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌వ‌శ‌కం మేక‌ర్స్‌!
X

ఇండ‌స్ట్రీలో పాత త‌రం వెళుతుంటుంది..కొత్త త‌రం ఎంట్రీ ఇస్తుంటుంది. టాలీవుడ్‌లో కూడా పాత త‌రం సైలెంట్ అవుతూ వ‌స్తున్నారు. ఇదే స‌మ‌యంలో కొత్త ర‌క్తం రంగ‌ప్ర‌వేశం చేస్తోంది. మ‌న టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో టాప్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు చాలానే ఉన్నాయి. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ, దిల్ రాజు, స్వ‌ప్న సినిమా స్వ‌ప్న‌దిత్, ప్రియాంక ద‌త్, మైత్రీ మూవీ మేక‌ర్స్ న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్‌, సాహు గార‌పాటి, సుధాక‌ర్ చెరుకూరి, టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ వంటి మేక‌ర్స్ ఉన్నారు.

వీరంతా కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా లైన‌ప్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. వీరికి ముందు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగిన మేక‌ర్స్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సురేష్ బాబు, గీతా ఆర్ట్స్ అల్లు అర‌వింద్ సైలెంట్ అయిపోయారు. ఇండ‌స్ట్రీలోకి యువ ర‌క్తం ప్ర‌వేశించ‌డంతో వీరు సైడ్ అయిపోయారు. ఇప్పుడు న‌వ‌శ‌కం మేక‌ర్స్ మొద‌ల‌య్యారు. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌ని ఎంచుకుంటూ మినిమ‌మ్ బ‌డ్జెట్ సినిమాల‌తో స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకుంటున్నారు.

ఈ త‌రం మేక‌ర్స్‌గా యంగ్ ప్రొడ్యూస‌ర్స్ ధీర‌జ్ మొగిలినేని, రాజేష్ దండ‌, ఎస్‌కెఎన్‌, వంశీ నందిపాటి, బెన్ని ముప్ప‌నేని, నిహారిక కొణిదెల‌, బ‌న్నీ వాస్ త‌దిత‌రులు ప్ర‌తి నెల ఏదో ఒక సినిమాని ప్ర‌క‌టిస్తూ, రిలీజ్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని చూస్తున్నారు. ఈ యువ నిర్మాత‌ల్లో చాలా మంది చాలా వ‌ర‌కు మూడు నాలుగు సినిమాల‌తో బిజీగా ఉంటున్నారు. ఇందులో వంశీ నందిపాటి సినిమాల నిర్మాణంతో పాటు మార్కెటింగ్ విష‌యాల్లోనూ త‌న‌దైన పాత్ర పోషిస్తున్నారు.

ఇక నిహారిక కొణిదెల మినిమ‌మ్ బ‌డ్జెట్ సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే టీవీ షోల‌పై ఫోక‌స్ పెడుతూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. ఇక రాజేష్ దండ క్రేజీ లైన‌ప్‌తో సినిమాలు చేస్తున్నాడు. అల్ల‌రి న‌రేష్‌, సంయుక్త మీన‌న్‌, అడివి శేష్ వంటి క్రేజీ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నారు. చిన్న మిడ్ రేంజ్ సినిమాలు చేస్తూ భారీ ఓటీటీ డీల్స్‌ని ద‌క్కించుకుంటున్నాడు. 2017 వ‌ర‌కు వ‌రుస ప్రాజెక్ట్‌ల లైన‌ప్‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. న్యూ జ‌న‌రేష‌న్ థాట్స్‌తో కొత్త ర‌త‌హా సినిమాలు చేస్తున్న న‌వ‌శ‌కం మేక‌ర్స్ రానున్న రోజుల్లో ఎలాంటి మూవీస్‌ని టాలీవుడ్‌కు అందిస్తారో వేచి చూడాల్సిందే.