Begin typing your search above and press return to search.

పెళ్లిలో డోలారే డోలా.. మాధురి దుమ్ము దుమారం

ఈ వేడుక‌ల్లో మొద‌టి రోజు జూనియ‌ర్ ట్రంప్ తో పాటు అత‌డి గాళ్ ఫ్రెండ్ బెట్టేగా పాల్గొన్నారు.

By:  Sivaji Kontham   |   24 Nov 2025 12:00 AM IST
పెళ్లిలో డోలారే డోలా.. మాధురి దుమ్ము దుమారం
X

ఓర్లాండోకు చెందిన బిలియనీర్, ఫార్మా దిగ్గ‌జం రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన - సూపర్ ఆర్డర్ (రెస్టారెంట్ చైన్ సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప‌ర్) సహ వ్యవస్థాపకురాలు వంశీ గదిరాజు పెళ్లి సంబ‌రాలు ఆకాశాన్ని అంటిన సంగ‌తి తెలిసిందే. అంబానీల పెళ్లి త‌ర్వాత భార‌త‌దేశంలో అత్యంత ఖ‌రీదైన వివాహంగా దీని గురించి చెప్పుకుంటున్నారు. పెళ్లి వేడుక‌ల్లో బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల నృత్యాల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. ఉద‌య్ పూర్ లో నవంబర్ 21న వేడుకలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 22న మెహందీ వేడుకలో మాధురీ దీక్షిత్ ప్రత్యేక ప్రదర్శనతో అభిమానులు అలరించారు.

ఈ వేడుక‌ల్లో మొద‌టి రోజు జూనియ‌ర్ ట్రంప్ తో పాటు అత‌డి గాళ్ ఫ్రెండ్ బెట్టేగా పాల్గొన్నారు. అలాగే జెన్నిఫ‌ర్ లోపేజ్, జ‌స్టిన్ బీబ‌ర్ లాంటి ప్ర‌ముఖులు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, కృతి సనన్, షాహిద్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశమైన పెళ్లి వేడుక ఇది. రామ‌రాజు మంతెన అమెరికాలో ఫార్మా దిగ్గ‌జంగా పాపుల‌ర‌య్యారు.

ఈ జంట మెహందీ వేడుకలో మాధురీ దీక్షిత్ డ్యాన్సింగ్ వీడియో వేగంగా వైర‌ల్ అయింది. ఆకుపచ్చ లెహంగా-చోళీ ధ‌రించి దానిపై పింక్ దుపట్టాను క‌ప్పుకున్న మాధురీ `దేవదాస్` చిత్రంలోని `డోలా రే డోలా` పాటలోని ఐకానిక్ హుక్ స్టెప్‌ను తిరిగి సృష్టించింది. అభిమానులు మాధురి డ్యాన్సుల్లో జోష్ కి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాల‌లో ప్ర‌స్తుతం ఈ క్లిప్ లు వైర‌ల్ గా మారుతున్నాయి. మాధురి రాక‌తో ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ వ‌చ్చింద‌ని ప్ర‌శంసిస్తున్నారు.

మెహందీ నైట్ హోస్టింగ్ బాధ్యతలను నటి దియా మీర్జా మేనేజ్ చేయ‌గా, నోరా ఫతేహి హై ఎనర్జీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో హీట్ పుట్టించింది. సంగీత్ నైట్ లో కరణ్ జోహార్ -సోఫీ చౌదరి యాంక‌రింగ్ తో ఆక‌ట్టుకున్నారు. వేడుక‌కు విచ్చేసిన చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు డ్యాన్స్ ఫ్లోర్ పై అద‌ర‌గొట్టారు. నేత్ర మంతెన - వంశీ గాదిరాజు వివాహం గెస్ట్ లిస్ట్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ నవంబర్ 23తో ముగుస్తుంది.