వీడియో : 'ఓజీ' గౌరవార్ధం నెట్‌ఫ్లిక్స్..!
ఇప్పటికే ఓజీ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. థియేట్రికల్ రిలీజ్ సమయంలో రీ సౌండ్ చేసిన ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలోనూ సోషల్ మీడియాలో అదే రేంజ్‌లో సందడి చేస్తున్నాడు.
By: Ramesh Palla | 25 Oct 2025 4:06 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. దసరా కానుకగా థియేట్రికల్ రిలీజ్ అయిన ఓజీ సినిమాను దీపావళి కానుకగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు నెట్‌ఫ్లిక్స్ తీసుకు వచ్చింది. ఇప్పటికే ఓజీ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. థియేట్రికల్ రిలీజ్ సమయంలో రీ సౌండ్ చేసిన ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలోనూ సోషల్ మీడియాలో అదే రేంజ్‌లో సందడి చేస్తున్నాడు. ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫుల్ మీల్స్ వంటి సినిమాను అందించాడు. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో తమన్ ప్రతి సీన్ ను హైలైట్‌గా నిలిచే విధంగా చేశాడు అంటూ రివ్యూలు వచ్చాయి. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత సినిమా గురించిన చర్చ మరింతగా సోషల్ మీడియాలో జరుగుతూ, విజువల్స్ ను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకమైన వీడియోను రూపొందించడం ద్వారా సినిమాకు అలాగే పవన్ కళ్యాణ్ పై తమకు ఉన్న గౌరవంను చూపించే ప్రయత్నం చేసింది. దీపావళి సందర్భంగా స్ట్రీమింగ్ మొదలు అయింది కనుక ఈ సినిమా పోస్టర్‌ను దీపాలతో వెలిగించడం ద్వారా నెట్‌ఫ్లిక్స్ ఓజీని మరింత ప్రత్యేకంగా మార్చారు. పవన్ కళ్యాణ్ ఆర్ట్ వేసి, ఓజీ తరహా పోస్టర్ డిజైన్ చేసి దాన్ని మొత్తం దీపాలతో నింపేసి వాటిని వెలిగించి పవన్ ఫ్యాన్స్‌కి కన్నుల విందు చేశారు. ఇది ఖచ్చితంగా పవన్ ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్‌కి కూడా గొప్ప గౌరవం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇలాంటివి చాలా అరుదుగా మాత్రమే చూస్తూ ఉంటాం. పవన్ కి ఉన్న స్టార్‌డం, ఓజీ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇలా దీపావళిని నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఇండియా వారు సెలబ్రేట్ చేయడం జరిగింది.
ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్
ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ మొదలుకుని, ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి ఒక్కటి ఆకట్టుకున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ కోసం సినిమాకు వెళ్లిన వారు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతారు అని మరోసారి ఓటీటీలో చూసిన వారు సైతం అంటున్నారు. పవన్ మార్క్ మేనరిజం మిస్ కాకుండా, ఆయన స్టైల్, ఆయన వింటేజ్ లుక్ ఇలా ప్రతి ఒక్కటి ఫ్యాన్స్‌ను కుర్చి అంచున కూర్చోబెట్టే విధంగా దర్శకుడు సాహో సుజీత్ డిజైన్ చేశాడు. ఆయన ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించాడు. ఆయన ఆ సమయంలో మూడు నాలుగు సినిమాలు చేసే అవకాశం ఉంది. అయినా కూడా ఓజీ పై నమ్మకంతో సుజీత్ మరే సినిమాకు కమిట్ కాకుండా, అంతకు ముందే కమిట్ అయిన నాని సినిమాను పక్కన పెట్టి మరీ వర్క్ చేశాడు. దాంతో ఓజీ ఔట్ పుట్ అద్భుతంగా వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా
మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో భారీ స్టార్‌కాస్ట్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ కాంబోలో వచ్చే పాటకు మంచి స్పందన వచ్చింది. ఆ పాటలో పవన్, ప్రియాంక ఇద్దరూ చాలా అందంగా, క్యూట్‌గా రియలిస్టిక్‌గా ఉన్నారు అంటూ ప్రేక్షకుల నుంచి స్పందన దక్కింది. ఇక కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హస్మీ, శ్రియా రెడ్డి ఇలా ప్రతి ఒక్కరి పాత్రలు గుర్తుండి పోయేలా ఉన్నాయి. సినిమాలోని యాక్షన్ సీన్స్, వాటికి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఇలా ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్లు మూసినా.. తెరిచినా గుర్తుకు వచ్చేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోనూ అన్ని భాషల్లో ట్రెండ్ అవుతోంది.
