యువహీరో ఫింగరింగ్ వల్లనే యువనటి ఔట్!
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక క్రేజీ వెబ్ సిరీస్ చుట్టూ ప్రస్తుతం బాలీవుడ్‌లో సరికొత్త వివాదం చెలరేగింది.
By: Sivaji Kontham | 18 May 2026 7:00 PM ISTఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక క్రేజీ వెబ్ సిరీస్ చుట్టూ ప్రస్తుతం బాలీవుడ్‌లో సరికొత్త వివాదం చెలరేగింది. ఈ సిరీస్ మొదటి సీజన్‌కు ప్రేక్షకులలో మిశ్రమ స్పందన లభించినా సీజన్ 2 గురించిన వార్తలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించిన యువనటి రెండో సీజన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందనే వార్త బాలీవుడ్ వ్యాపార వర్గాలలోను, సోషల్ మీడియాలోను తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ భామ వైదొలగడానికి గల కారణాలపై నెటిజన్లు, సినీ విశ్లేషకులు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా వేదిక రెడ్డిట్ లోని ఒక గాసిప్ ఫోరమ్‌లో వచ్చిన పోస్ట్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ సిరీస్‌లో యువనటి కో-స్టార్‌గా నటించిన యువహీరో ప్రవర్తన- అతి జోక్యం వల్లే ఈ సిరీస్ నుంచి నటి తప్పుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సిరీస్ క్రియేటివ్ మేకింగ్ విషయంలో యువహీరో తనకున్న ఇన్‌ఫ్లుయెన్స్‌తో మితిమీరిన జోక్యం చేసుకున్నాడని, దీనివల్ల ప్రొడక్షన్ సమయంలో యువనటి తీవ్రంగా సైడ్‌లైన్ అయిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితులు సదరు నటి మానసిక ప్రశాంతతను దెబ్బతీశాయని.. అందుకే ఆమె సీజన్ 2 నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుందనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక లేదా నిర్ధారిత ఆధారాలు లేవు.
మరోవైపు ప్రధాన స్రవంతి వినోద వార్తల మాధ్యమాలు విభిన్నమైన కథనాలను ప్రచురిస్తున్నాయి. యువనటి ఎగ్జిట్ వెనుక ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని.. కేవలం కథ డిమాండ్ మేరకు జరిగిన మార్పుల వల్లే సదరు నటీమణి తదుపరి సీజన్‌లో కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నాయి. దర్శకనిర్మాతలు రెండో సీజన్ స్క్రిప్ట్‌లో యువనటి, యువహీరో పాత్రల మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ కంటే.. రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన డ్రామా, సెంటిమెంట్లపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నారట. ఈ కథాంశ మార్పుల వల్లే యువనటి పాత్ర తదుపరి సీజన్‌లో కొనసాగడం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నిజానికి ఈ సిరీస్ మొదటి సీజన్ విడుదలైన సమయంలో యువనటి నటన, శారీరక రూపం పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నెగిటివ్ ట్రోలింగ్ నడిచింది. యువహీరోతో ఆమె స్క్రీన్ కెమిస్ట్రీ అస్సలు వర్కవుట్ కాలేదని... తన నటన అంతగా ఆకట్టుకోలేదని రెడ్డిట్ చర్చల్లో నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. అయితే ప్రస్తుతం యువహీరోపై వస్తున్న రూమర్స్ కేవలం యువనటిపై వచ్చిన ఆ విమర్శలను, ట్రోల్స్‌ను పక్కదారి పట్టించడానికి కొందరు కావాలనే సృష్టించిన వ్యూహాత్మక ప్రచారమని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ ప్రొడక్షన్‌లో పెద్ద స్టార్లు ఉండగా.. కేవలం యువహీరో అంత పెద్ద నిర్ణయాలను ప్రభావితం చేయగలడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏది ఏమైనా.. బాలీవుడ్ స్టార్ కల్చర్, ఆన్‌లైన్ గాసిప్స్, తెరవెనుక జరిగే పరిణామాలు ఒక క్రేజీ ప్రాజెక్ట్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయనే దానికి ఈ తాజా వివాదమే ఒక పెద్ద ఉదాహరణ. ఈ రూమర్లపై అటు యువనటి కానీ, ఇటు యువహీరో కానీ లేదా నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో రెండో సీజన్ షూటింగ్ ప్రారంభమయ్యాక కానీ యువనటి ఎగ్జిట్‌పై పూర్తి క్లారిటీ రాదన్నమాట!
