రెండు దిగ్గజ సంస్థల విలీనంతో పుట్టుకొచ్చే ప్రమాదం?
హెచ్‌బివో ప్రీమియం కంటెంట్ , హ్యారీపోటర్, డిసి ఉత్పత్తులను నెట్ ఫ్లిక్స్ నియంత్రించగలదని ఒక సెక్షన్ లో ఆదోళన నెలకొంది.
By: Sivaji Kontham | 16 Dec 2025 12:00 AM ISTఏదైనా మెర్జర్ లేదా కొనుగోలు వ్యవహారంలో వినియోగదారులు లేదా సబ్ స్క్రైబర్లు నష్టపోవడానికి ఉన్న అవకాశాలను ప్రభుత్వం లేదా చట్టం పరిశీలిస్తుందా? ఈ ఒప్పంద వ్యవహారాలు చట్ట పరిధిలోకి వస్తాయా? గంపగుత్తగా ప్రత్యర్థులను కొనుగోలు చేసి, ఇష్టానుసారం రింగ్ మాస్టర్లు సబ్ స్క్రిప్షన్ ధరల్ని పెంచుకుని ప్రజలను దోచేయాలనే పన్నాగానికి ప్రభుత్వాలు లేదా చట్టాలు అంగీకరిస్తాయా?
కంపెనీల విలీనం కారణంగా అప్పటికే ఆయా కంపెనీలతో అనుబంధంగా టై అప్ అయిన ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ఇండస్ట్రియల్ లా అనేది పని చేస్తుంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్- వార్నర్ బ్రదర్స్ విలీన(కొనుగోలు) ఒప్పందం విషయంలోను చాలా పరిశీలన జరుగుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.
వార్నర్ బ్రదర్స్ స్టూడియోలు, హెచ్.బి.వో మ్యాక్స్ లను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు దాదాపు 72 బిలయిన్ డాలర్ల ఒప్పందాన్ని నెట్ ఫ్లిక్స్ కుదుర్చుకుందని ఇప్పటికే కథనాలొచ్చాయి. విలీనం తర్వాత నెట్ ఫ్లిక్స్ దాదాపు 428 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను చేరుకుంటుందని అంచనా. నెట్‌ఫ్లిక్స్, ఆ సంస్థకు చెందిన గ్లోబల్ కేబుల్ నెట్‌వర్క్‌లను విడిగా విభజించిన తర్వాత వార్నర్ స్టూడియో, స్ట్రీమింగ్ ఆస్తులను కొనుగోలు చేయాలని యోచిస్తోంది.
హెచ్‌బివో ప్రీమియం కంటెంట్ , హ్యారీపోటర్, డిసి ఉత్పత్తులను నెట్ ఫ్లిక్స్ నియంత్రించగలదని ఒక సెక్షన్ లో ఆదోళన నెలకొంది. యూట్యూబ్, టిక్ టాక్ వేదికలతో పోటీపడటానికి ఈ విలీనం సహకరిస్తుందని నెట్ ఫ్లిక్స్ వాదిస్తున్నా.. ఈ తరహా పోలికను ఎవరూ నమ్మడం లేదు. యూట్యూబ్ ప్రకటనలు ఇవ్వాలంటే దానికి ప్రత్యేకించి ఒక మోడల్ ఉంటుంది.. దానిని మాత్రమే అనుసరిచాలి. దీనికి విరుద్ధంగా నెట్ ఫ్లిక్స్ గేమ్ ప్లాన్ ఇప్పుడు తాజా మెర్జర్ తో పని చేస్తుంది.
ఇలాంటి చట్టపరమైన కారణాలతో దీనిపై న్యాయపరమైన సమీక్ష జరగాలని అమెరికాలో సంబంధిత శాఖలు పట్టుబడుతున్నాయి. ఈ విలీనం పోటీని తగ్గించి, మోనోపలి తరహాలో సబ్‌స్క్రిప్షన్ ధరల్ని నిర్ణయించేందుకు అవకాశం ఉందని, క్రియేటివిటీని నియంత్రించే వీలుందని సంబంధిత చట్ట పరిధిలో వ్యక్తులు హెచ్చరిస్తున్నారు. అలాగే నెట్ ఫ్లిక్స్ వ్యవహారాలతో ముడిపడిన యూరఫ్- బ్రిటన్ నియంత్రిత దర్యాప్తు సంస్థలు కూడా దీనిపై విచారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇది పైకి కనిపించనంత పెద్ద సమస్య. కోట్లాదిగా సబ్ స్క్రైబర్లు ప్రభావితం అయ్యే అతిపెద్ద సమస్య. రెండు బడా సంస్థల విలీనం చాలా ఆందోళనలకు దారి తీస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. ఓటీటీ రంగంలో నెట్ ఫ్లిక్స్ గుత్తాధిపత్యం లేదా అధికారం పెను సమస్యలకు దారి తీయొచ్చనే ఆందోళనలు అలానే ఉన్నాయి.
