Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌..వాళ్ల‌ని ఎంక‌రేజ్ చేస్తుందా?

ఓటీటీ గేమ్‌లో వ‌ర‌ల్డ్ నెంబర్ వ‌న్ స్థానాన్ని సొంతం చేసుకున్న ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌.

By:  Ravindar Gorantla   |   12 March 2026 4:31 PM IST
హైద‌రాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌..వాళ్ల‌ని ఎంక‌రేజ్ చేస్తుందా?
X

ఓటీటీ గేమ్‌లో వ‌ర‌ల్డ్ నెంబర్ వ‌న్ స్థానాన్ని సొంతం చేసుకున్న ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌. వ‌ర‌ల్డ్ క్లాసిక్ మూవీస్‌, సిరీస్‌ల‌తో, ఒరిజిన‌ల్స్‌తో వ‌ర‌ల్డ్ వైడ్‌గా మేక‌ర్స్‌కి, వీక్ష‌కుల‌కు ప్ర‌ధాన ఆధారంగా నిలిచిన సంస్థ ఇది. ఇండియాలోని వాణిజ్య రాజ‌ధాని ముంబైలో మొట్ట‌మొదిటి ఆఫీస్‌ని ఏర్పాటు చేసి అక్క‌డి నుంచే దేశ వ్యాప్తంగా కార్య‌కలాపాల్ని సాధిస్తూ వ‌స్తోంది. అయితే గ‌త కొన్ని నెల‌ల క్రితం టాలీవుడ్ దిగ్గ‌జాల‌ని క‌లిసి వెళ్లిన నెట్‌ఫ్లిక్స్ వ‌ర్గాలు టాలీవుడ్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి ప్ర‌ధాన ఆధారంగా మార‌డంతో ఇక్క‌డ మ‌రో ఆఫీస్‌ని ఓపెన్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అనుకున్న విధంగానే హైద‌రాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ కార్యాయ‌లాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాల‌యంలోని ఐలైన్ స్టూడియోని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో నెట్‌ఫ్లిక్స్ వ‌ర్గాల‌తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ సెక్రెట‌రీ సంజ‌య్ జాజు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, ప్ర‌ముఖ నిర్మాత‌, ఎఫ్‌డీసీ చైర్మ‌న్ దిల్ రాజు, హీరో రానా త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

నెట్‌ఫ్లిక్స్ హైద‌రాబాద్‌లో ఆఫీస్‌ను ఓపెన్ చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. నెట్‌ఫ్లిక్స్ టాలెంట్‌ని క‌లెక్ట్ చేస్తుంద‌ని, డీవీడీలు అద్దెకు ఇచ్చే స్టేజ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా ఎదిగింద‌ని, ప్ర‌జులు నెట్‌ఫ్లిక్స్‌ని ఇష్డన‌డిన‌ట్టుగానే హైద‌రాబ‌ద్‌ను కూడా అన్ని విష‌యాల్లో ఇష్ట‌ప‌డ‌తార‌న్నారు. తెలంగాణ టాలెంట్‌ని నెట్ ఫ్లిక్స్ గ్లోబ‌ల్ ఆడియ‌న్స్‌కి ప‌రిచ‌యం చేస్తుంద‌నే న‌మ్మ‌ర‌ముంది. హైద‌రాబాద్‌కు పురాత‌న చ‌రిత్ర ఉంద‌ని, సినిమాలంటే చిన్న‌త‌నం నుంచి త‌న‌కు ఇష్ట‌మ‌న్నారు.

అయితే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తాను ఎక్కువ‌గా చూస్తుండే వాడిన‌న్నారు. బ్లాక్ అండ్ వైడ్ కాలం నుంచి సినిమా ఒక్కో విధంగా మారుతూ వ‌చ్చింద‌న్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రామానాయుడు వంటి వాళ్లు హైద‌రాబాద్‌కు సినిమాని తీసుకొచ్చార‌ని, హైద‌రాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వ‌చ్చిందంటే హాలీవుడ్ వ‌చ్చిన‌ట్టే అన్నారు. బుంబైకే ప‌రిమిత‌మైన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింది. ఈ నేఫ‌థ్యంలో లోక‌ల్ కంటెంట్‌కు ప్ర‌ధాన్య‌త నిస్తుందా? ఎక్కువ మంది డైరెక్ట‌ర్లు అవ‌కాశాలు ల‌భిస్తాయా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

లోక‌ల్ ఓటీటీల‌కే కాళ్ల‌కు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ప‌ట్టించుకోని ప‌రిస్థితుల క‌నిపిస్తున్నాయి. బ‌డా బ‌డా కంప‌నీలు, డైరెక్ట‌ర్ల‌ని కాద‌ని నెట్ ఫ్లిక్స్ వ‌ర్గాలు లోక‌ల్ టాలెంట్‌కు అవ‌కాశాలిస్తారా? స్క్రిస్ట్‌లు ప‌ట్టుకుని ఫిల్మ్ న‌గ‌ర్ ఆఫీసుల చుట్టూ తిరిగిన అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఓటీటీల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోతున్న వారికి నెట్ ఫ్లిక్స్ న్యాయం చేస్తుందా? అన్న‌ది ఇప్ప‌డు ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప‌జేస్తోంది.