Begin typing your search above and press return to search.

మల్టీస్టారర్ సినిమాకు డైరెక్టర్ కష్టాలు..?

కోలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న కథానాయకులు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్.

By:  Ramesh Boddu   |   25 Oct 2025 9:44 AM IST
మల్టీస్టారర్ సినిమాకు డైరెక్టర్ కష్టాలు..?
X

కోలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న కథానాయకులు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్. ఇద్దరు వారి వారి సినిమాలతో కొన్ని దశాబ్దాలుగా సినీ లవర్స్ ని అలరిస్తూ వస్తున్నారు. కోలీవుడ్ పరిశ్రమకు ఈ ఇద్దరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ అక్కడ స్టార్స్ కి ధీటుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు ఈ ఇద్దరు స్టార్స్.

రజనీ, కమల్ ఇద్దరు కెరీర్ మొదట్లో..

ఐతే రజనీ, కమల్ ఇద్దరు కెరీర్ మొదట్లో కలిసి నటించారు. ఇద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడి.. సూపర్ స్టార్స్ అయ్యాక కలిసి నటించలేదు. కనీసం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అందుకే ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్ పై గురి కుదిరింది. కమల్, రజనీ ఇద్దరు కూడా కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేరు వేరు సందర్భాల్లో రజనీతో సినిమా ఉంటుందని కమల్.. కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నా అని రజనీ చెప్పారు.

ఈ ఇద్దరు హీరోలను కలిసి సినిమా తీసే డైరెక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అసైతే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ కూలీ ఇచ్చిన షాక్ వల్ల ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు లోకేష్. మరోపక్క యువ దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్ కి ఈ ఛాన్స్ ఇస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చింది.

ఈ కాంబినేషన్ సినిమా హ్యాండిల్ చేసే ఛాన్స్..

కార్తీక్ సుబ్బరాజ్ కూడా డిస్కషన్ లో ఉన్నా రెట్రో ఫ్లాప్ తర్వాత అతను కూడా ఈ మల్టీస్టారర్ కు రెడీగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఐతే ఫైనల్ గా ఒక డైరెక్టర్ ఈ కాంబినేషన్ సినిమా హ్యాండిల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అతను ఎవరో కాదు నెల్సన్ దిలీప్ కుమార్. సూపర్ స్టార్ రజినీతో జైలర్ సినిమా తీసి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు నెల్సన్. ప్రస్తుతం రజినీతో జైలర్ 2 చేస్తున్నాడు నెల్సన్.

ఈ సినిమా తర్వాత రజనీ, కమల్ మల్టీస్టారర్ కూడా ఆయనే డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. లోకేష్, కార్తీ, ప్రదీప్ ఇలా వీళ్లందరి కన్నా నెల్సన్ తోనే ఈ మల్టీస్టారర్ చేయాలని అనుకుంటున్నారట. నెక్స్ట్ అనౌన్స్ మెంట్ రావడమే లేట్ అంటున్నారు.

ఐతే రజనీ, కమల్ సినిమాను నెల్సన్ తీస్తే ఎన్టీఆర్ తో తను చేసే సినిమా ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే ఎలాగు ఎన్టీఆర్ నీల్ తో చేసే సినిమా తర్వాత త్రివిక్రం సినిమా ఉంటుంది కాబట్టి సమస్య ఉండకపోవచ్చని తెలుస్తుంది.