Begin typing your search above and press return to search.

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన డైరెక్ట‌ర్

అయితే నేహ‌ల్ వ‌డోలియా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన త‌ర్వాత ఎట్ట‌కేల‌కు సుభాష్ ఘ‌య్ స్పందించారు. ఆయ‌న ఒక అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు.

By:  Srikanth Kontham   |   2 Oct 2025 7:00 AM IST
లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన డైరెక్ట‌ర్
X

బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సుభాష్ ఘాయ్ పై కొన్ని రోజుల క్రితం అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడంటూ న‌టి నేహ‌ల్ వ‌డోలియా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అత‌డిని ఇంటి వ‌ద్ద క‌ల‌వ‌డానికి వెళ్లిన‌ప్పుడు త‌న ప్రియుడి (సుభాష్ జీ మేనేజ‌ర్) స‌మ‌క్షంలోనే సుభాష్ ఘ‌య్ లైంగికంగా వేధించాడ‌ని నేహ‌ల్ ఆరోపించింది. త‌న ప్రియుడికి తెలిసే జ‌రిగింది కాబ‌ట్టి ఆ ఘ‌టన త‌ర్వాత నేహ‌ల్ ప్రియుడితో బ్రేక‌ప్ కూడా చేసుకుంది.

అయితే నేహ‌ల్ వ‌డోలియా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన త‌ర్వాత ఎట్ట‌కేల‌కు సుభాష్ ఘ‌య్ స్పందించారు. ఆయ‌న ఒక అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు. త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం ద్వారా ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ఖండించారు. నేహ‌ల్ పేరును ప్ర‌స్థావించ‌కుండానే అలాంటి వ్య‌క్తిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బెదిరించారు. ``నా ప్రతిష్టను లేదా నా కంపెనీలు, టీమ్ సభ్యులపై తప్పుడు ఆరోపణలతో కించపరచడానికి ప్రయత్నించే ఏ వ్యక్తిపై అయినా చట్టప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం. పరువు నష్టం కలిగించే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా న్యాయ బృందం సిద్ధంగా ఉంది`` అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఎవ‌రైనా ఫిర్యాదు చేయాల‌నుకుంటే పోలీసులు లేదా సంబంధిత అధికారుల‌ను సంప్ర‌దించాలి. ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను సోష‌ల్ మీడియాల‌లో వైర‌ల్ చేయాల‌నుకోవ‌డం ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా చట్టవిరుద్ధం అని ఘ‌య్ ఆ నోట్ లో పేర్కొన్నారు.

తాను అత‌డి ఇంటికి వెళ్లిన‌ప్పుడు నా ప్రియుడు కూడా అక్క‌డే ఉన్నాడు. అత‌డు సుభాష్ జీకి మేనేజ‌ర్. అందువ‌ల్ల ముగ్గురూ సాయంత్రం వేళ వైన్ పుచ్చుకుంటూ స‌ర‌దాగా గ‌డిపాం. ఇంత‌లోనే ఘాయ్ తన రూపాన్ని ప్రశంసించడం ప్రారంభించాడని, తన నవ్వును అంద‌మైన న‌వ్వు అని ప్ర‌శంసించి, చాలా *క్సీగా ఉన్నావ‌ని పొగిడేసిన‌ట్టు తెలిపింది. తన ప్రియుడి సమక్షంలో ఈ కామెంట్లు అసౌకర్యానికి గురిచేశాయని ఆమె ఆరోపించింది.

ఘాయ్ వాష్‌రూమ్ దగ్గర తనను అనుసరించినప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. నేను బయటకు వచ్చిన వెంటనే సుభాష్ జీ గదిలోకి ప్రవేశించాడు. అతను చాలా దగ్గరగా వచ్చినప్పుడు నేను పూర్తిగా షాక్ అయ్యాను. అతడి కళ్ళు మూసుకుపోయాయి. నేను పక్కకు వెళుతుంటే అత‌డి పెదవులు నా చెంపను తాకాయి. అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు. పెదవులపైనా ముద్దు పెట్టుకోబోతున్నాడని నేను నా ప్రియుడితో చెప్పాను! అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

ఆరోజు అలాంటి దుస్థితిలోకి నెట్టేసినందుకు ప్రియుడిపైనా నేహ‌ల్ కోపం వ్య‌క్తం చేసింది. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? నువ్వు అతడి మేనేజర్.. అంటే నీకు ఈ విషయాలన్నీ ఇప్పటికే తెలుసు అని వాదించింది. ఆరోజుతో అత‌డితో బంధం కట్ అయింది.