జిమ్ షూట్ లో నేహా సోయగాలు.. గ్లామర్ తో కట్టిపడేస్తూ!
ముఖ్యంగా తాను తీసుకునే బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే నేహా శర్మ ఇక డైలీ రొటీన్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంది.
By: Madhu Reddy | 21 May 2026 12:53 PM ISTనేహా శర్మ.. గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ లా.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ ను కట్టిపడేస్తోంది. 1987 నవంబర్ 21న బీహార్ లోని భాగల్పూర్ లో జన్మించిన నేహా శెట్టి.. బీహార్ లోని మౌంట్ కర్మెల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసింది. న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కాలేజ్ లో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది. ఇక ఈమె తండ్రి అజిత్ శర్మ.. వ్యాపారవేత్త మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా.. భాగల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అందం, అభినయంతో, గ్లామర్ తో కట్టిపడేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న నేహా శర్మ.. చిన్న వయసులోనే ఆస్తమావ్యాధితో బాధపడిందని తెలిసి అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే హైదరాబాదుకు చెందిన తమ బంధువులు ఆ వ్యాధి నయం అవడానికి సహాయపడ్డారని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నాను అంటూ చెబుతోంది. ఇకపోతే ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన నేహా శర్మ.. మొదటిసారి ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా వెండితెరకు పరిచయమైన చిరుత అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం , నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. 2009లో వచ్చిన కుర్రాడు సినిమాలో నటించి తెలుగు తెరకు దూరమయింది.
ఇక 2010లో క్రూక్ :ఇట్స్ గుడ్ టు బి బ్యాడ్ అనే చిత్రం ద్వారా హిందీ పరిశ్రమకు పరిచయమైన ఈమె.. అప్పటినుంచి హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. ఇకపోతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోస్తున్న నేహా శర్మ.. తాజాగా జిమ్ సెంటర్ నుండి బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ముఖ్యంగా తాను తీసుకునే బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే నేహా శర్మ ఇక డైలీ రొటీన్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంది. మరికొన్ని ఫోటోలలో బికినీ ధరించి బీచ్ ఒడ్డున వెల్లకిలా పడుకొని సూర్యరశ్మిని తట్టుకోలేక కళ్ళకు చేతులను అడ్డుపెట్టుకొని ఆ ఫోటోలను కూడా షేర్ చేసింది. మొత్తానికైతే నేహా శర్మ అందాల విందు అభిమానులకు మరింత ఊరట కలిగించిందని చెప్పవచ్చు.
ఇకపోతే నేహా శర్మ ఫోటోలు చూసిన నెటిజన్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో కొంతమంది మనం ఏం చూడాలనుకుంటున్నామో ఆమెకు తెలుసు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరొక నిటిజన్ చాలా అందంగా, అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే నేహా శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
నేహా శర్మ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా 2024 లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ బ్యాడ్ న్యూజ్ , అలాగే ఓటిటి థ్రిల్లర్ సిరీస్ 36 డేస్ చిత్రాలలో వెండితెరపై కనిపించిన ఈమె ఇటీవల దేదే ప్యార్ దే 2 లో కూడా కీలకపాత్ర పోషించింది.
