Begin typing your search above and press return to search.

మ‌తులు చెడ‌గొడుతున్న నేహా శ‌ర్మ‌

నేహా శర్మ గ్లామర్ ఫోటోషూట్‌ల విషయంలో సోషల్ మీడియాలలో చెల‌రేగుతోంది. ఇన్‌స్టాలో 2కోట్ల (20 మిలియన్ల) మంది ఫాలోవ‌ర్స్ ఉన్న ఈ బ్యూటీ క్రేజ్ ని క‌చ్ఛితంగా అంచ‌నా వేయొచ్చు.

By:  Sivaji Kontham   |   20 Feb 2026 8:15 AM IST
మ‌తులు చెడ‌గొడుతున్న నేహా శ‌ర్మ‌
X

నేహా శర్మ గ్లామర్ ఫోటోషూట్‌ల విషయంలో సోషల్ మీడియాలలో చెల‌రేగుతోంది. ఇన్‌స్టాలో 2కోట్ల (20 మిలియన్ల) మంది ఫాలోవ‌ర్స్ ఉన్న ఈ బ్యూటీ క్రేజ్ ని క‌చ్ఛితంగా అంచ‌నా వేయొచ్చు. త‌న ఇన్ స్టా అభిమానుల కోసం నేహా నిరంత‌రం స్పెష‌ల్ ఫోటోషూట్లు, వీడియోల‌ను షేర్ చేస్తోంది.





నేహా శర్మ ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా ఓటిటిల‌లో వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. ఇటీవ‌లి కాలంలో ఇల్లీగ‌ల్- సీజ‌న్ 3లో న‌టించింది. లీగల్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో నేహా నటనకు మంచి గుర్తింపు వచ్చింది. 36 డేస్ ఇటీవల సోనీ లివ్‌లో విడుదలైంది. ఈ థ్రిల్లర్ సిరీస్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది. అలాగే పంజాబీలో సంజోగ్ అనే ప్రాజెక్ట్ చేస్తోంది. రెండేళ్ల క్రితం `బ్యాడ్ న్యూజ్` అనే చిత్రంలో చిన్న క్యామియో రోల్‌లో కనిపించింది.





అయితే నేహాకు నటిగా గ్యాప్ ఎందుకు? అంటే..త‌ను ఎంచుకుంటున్న ప్రాజెక్టులు ఎక్కువగా బాలీవుడ్ లేదా ఓటిటి ప్లాట్‌ఫామ్స్ కే పరిమితం అయ్యాయి. 2023లో విడుదలైన `జోగిరా సారా రా రా` (నవాజుద్దీన్ సిద్ధిఖీతో) తర్వాత ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌లలో బిజీగా ఉంది. అప్పుడప్పుడు తన తండ్రి అజిత్ శర్మ రాజకీయ ప్రచారాల్లో కూడా పాల్గొంటూ వార్తల్లో నిలుస్తోంది. త‌ను న‌టించాల్సిన ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం అంత‌కంత‌కు వాయిదా ప‌డ‌టం వ‌ల్ల కూడా నేహా లైమ్ లైట్ లో లేక‌పోవ‌డానికి కార‌ణం అవుతోంది.





చిరుత తర్వాత తెలుగుకి ఎందుకు రాలేదు?

రామ్ చరణ్ స‌ర‌స‌న చిరుతతో అద్భుతమైన డెబ్యూ ఇచ్చినా, ఆ తర్వాత వరుణ్ సందేశ్‌తో చేసిన `కుర్రాడు` ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తెలుగులో వరుసగా డాన్స్ ఓరియెంటెడ్ మాస్ సినిమాలలో ఆఫర్లు రావడంతో, కొంత కాలం బ్రేక్ తీసుకుని డాన్స్ నేర్చుకోవడానికి లండన్ వెళ్లింది. ఆ తర్వాత హిందీలో క్రూక్ (ఎమ్రాన్ హష్మీతో) ఆఫర్ రావడంతో నేహా తన మకాం ముంబైకి మార్చింది. అక్కడ వరుసగా అవకాశాలు రావడంతో తెలుగు వైపు మళ్లీ చూడలేదు. అయితే రీసెంట్‌గా నాని `హాయ్ నాన్న`లో ఒక చిన్న గెస్ట్ రోల్‌లో మెరిసింది.





బ్రేక్ ఎప్పుడొస్తుంది?

ప్రస్తుతం నేహా శర్మ దర్శకురాలిగా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ నిర్మాణంలో ఒక పీరియడ్ డ్రామాను నేహాశ‌ర్మ‌ డైరెక్ట్ చేయబోతోందని టాక్. నటిగా కంటే దర్శకురాలిగా ఈ బ్యూటీకి పెద్ద బ్రేక్ వస్తుందేమో చూడాలి.