Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ లుక్.. సర్ప్రైజ్ కావాలంటూనే గ్లామ్ తో హీటెక్కిస్తున్న నేహా శర్మ..

నేహా శర్మ తాజాగా వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర వెల్లకిలా పడుకొని సెల్ఫీ ఫోజులతో హీటెక్కించింది .

By:  Madhu Reddy   |   1 Sept 2026 11:08 AM IST
సెప్టెంబర్ లుక్.. సర్ప్రైజ్ కావాలంటూనే గ్లామ్ తో హీటెక్కిస్తున్న నేహా శర్మ..
X

ప్రతి మాసం ఒక కొత్త అద్భుతం జరగాలని కోరుకుంటూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో నేహా శర్మ కూడా ఒకరు. అందం, అభినయంతో.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఇటు సోషల్ మీడియాలో కూడా సెగలు పుట్టిస్తూ అభిమానులను సొంతం చేసుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా సెప్టెంబర్ నెల రాకతో కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికదా పంచుకుంది నేహా శర్మ. అందులో షేర్ చేసిన ఫోటోలు, పంచుకున్న క్యాప్షన్ అందరిని ఆకట్టుకున్నాయి.

నేహా శర్మ తాజాగా వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర వెల్లకిలా పడుకొని సెల్ఫీ ఫోజులతో హీటెక్కించింది . గ్రీన్ , ఐవరీ కలర్ మిక్స్ కాంబినేషన్లో చెక్స్ కలిగిన మినీ షాట్ ధరించిన ఈమె తన అందాలతో సెగలు పుట్టించింది ..సరికొత్త గ్లామర్ తో హీట్ పుట్టించేలా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో అభిమానులను హీటెక్కించే ఈ.ముద్దుగుమ్మ ఇప్పుడు మరింత హీట్ పుట్టించేలా ఫోటోలు షేర్ చేస్తూ సెల్ఫీ ఫోజులతో ఆకట్టుకుంది. పైగా "హలో సెప్టెంబర్.. నన్ను మరింత ఆశ్చర్యపరచు" అంటూ షేర్ చేసిన క్యాప్షన్ వైరల్ గా మారింది.

మరొక ఫోటోలో బ్లాక్ కలర్ టీ షర్టు, దానిపైన బ్లాక్ కలర్ కోట్ ధరించింది. దీనికి కాంబినేషన్లో బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్న ఈమె.. బాటమ్ బ్రౌన్ కలర్ ప్యాంటుతో తన మేకోవర్ను ఫుల్ ఫిల్ చేసుకుంది. ఇందులో నిండుగా కనిపించి మరొకసారి అభిమానులను ఆకట్టుకుంది. మొత్తానికి అయితే నేహా శర్మ షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. తొలిసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తొలి పరిచయమవుతూ చేసిన చిరుత. ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. 2007లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత 2009లో కుర్రాడు అనే చిత్రంలో నటించి మళ్లీ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది నేహా శర్మ.

ప్రస్తుతం ఈమె హరీష్ గార్గి దర్శకత్వం వహించిన జెస్సి గిల్ తో కలసి ఒక పంజాబీ చిత్రం అయిన సంజోగ్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే 1945 నేపథ్యంలో సాగే ఒక భారీ బడ్జెట్ పీరియడ్ క్రీచర్ డ్రామా తో దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. ఇక ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్ ఒక ఓటిటి ఫ్లాట్ ఫామ్ కోసం నిర్మిస్తున్నారు. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది , మోహిత్ రైనా నటిస్తున్నారు. అంతేకాదు హేరా ఫేరీ 3 అనే చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది.