క్రీడాకారులతో హీరోయిన్ ఎఫైర్ కహానీలో నిజమెంత?
గతంలో కూడా నేహా శర్మ తన సహనటులతో డేటింగ్‌లో ఉన్నట్లు కొన్ని రూమర్లు వచ్చాయి.. కానీ వాటిని ఎప్పుడూ ధృవీకరించలేదు
By: Sivaji Kontham | 22 Jan 2026 9:00 PM ISTఅందాల కథానాయిక నేహా శర్మ తన వ్యక్తిగత విషయాలను చాలా రహస్యంగా ఉంచుతారు. అయితే ఇటీవల ఒక విదేశీ వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని షికార్లు చేస్తూ కనిపించడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు... క్రొయేషియాకు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీటర్ స్లిస్కోవిక్ తో శర్మా గాళ్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరూ ముంబై వీధుల్లో ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నడుస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, నేహా తన సోదరి ఆయేషా శర్మతో కలిసి పీటర్ స్లిస్కోవిక్‌తో డిన్నర్‌కు వెళ్లినప్పుడు కూడా మీడియా కంట పడ్డారు. పీటర్ స్లిస్కోవిక్ ఎవరు? అంటే..అతడు 33 ఏళ్ల ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఇండియన్ సూపర్ లీగ్ (ISL)లో భాగంగా చెన్నైయిన్ ఎఫ్‌సి, జంషెడ్‌పూర్ ఎఫ్‌సి వంటి టీమ్‌ల తరపున ఆడారు. అయితే తమ రిలేషన్ షిప్ గురించి నేహా శర్మ కానీ, పీటర్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. నేహా తన వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచడానికే ఇష్టపడతారు.
క్రికెటర్లతో ఎఫైర్స్..
గతంలో కూడా నేహా శర్మ తన సహనటులతో డేటింగ్‌లో ఉన్నట్లు కొన్ని రూమర్లు వచ్చాయి.. కానీ వాటిని ఎప్పుడూ ధృవీకరించలేదు. కొందరు క్రికెటర్లతో కూడా ఎఫైర్ కహానీలు వినిపించాయి. నేహా శర్మకు యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్‌లతో ముడిపెడుతూ గతంలో కొన్ని పుకార్లు వచ్చాయి. యువరాజ్ సింగ్ తన కెరీర్ ఆరంభంలో చాలా మంది బాలీవుడ్ నటీమణులతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే యువరాజ్ సింగ్‌తో నేహా శర్మ ఎఫైర్ గురించి బలమైన ఆధారాలు ఏవీ లేవు. యువరాజ్ సింగ్ నేహా ధూపియాతో డేటింగ్‌లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నేహా ధూపియా, నేహా శర్మ పేర్లు ఒకేలా ఉండటం వల్ల చాలా మంది అయోమయానికి గురై, నేహా శర్మతో ఎఫైర్ ఉందని భావించారు. యువరాజ్ సింగ్ చివరకు 2016లో నటి హాజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్నారు.
కెఎల్ రాహుల్‌తో డేటింగ్ రూమర్స్
కెఎల్ రాహుల్ పేరు కూడా నేహా శర్మతో లింకప్ అయింది. కేఎల్ రాహుల్ గతంలో నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్ వంటి నటీమణులతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా నిధి అగర్వాల్‌తో కలిసి ఆయన ముంబైలో డిన్నర్‌కు వెళ్లిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. కానీ నేహా శర్మతో ఎఫైర్ ఉన్నట్టు కూడా కథనాలు వైరల్ అయ్యాయి. కానీ నేహా శర్మకు రాహుల్‌తో అటువంటి సంబంధం ఉన్నట్లు ఎక్కడా అధికారిక నిర్ధారణ లేదు. రాహుల్ ప్రస్తుతం సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు.
నేహా శర్మ బీహార్ కి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడి కుమార్తె. ఇటీవల ఎన్నికల్లో తన తండ్రి తరపున అవసరమైన ప్రచారం కూడా చేసింది. కానీ అతడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. నేహాశర్మ ఎన్.ఐ.టి ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేట్. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది. టాలీవుడ్ లో రామ్ చరణ్ సరసన చిరుత చిత్రంలో నటించింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ లోనే కెరీర్ రన్ సాగిస్తోంది. నేహా శర్మ తదుపరి హేరాఫేరి 3, వెల్ కం 3 వంటి చిత్రాలలో నటిస్తోంది. పలు వెబ్ సిరీస్‌లతోను బిజీగా ఉంది.
