సోషల్ మీడియాలో స్టార్… ఇన్‌స్టాగ్రామ్‌తో భారీగా సంపాదిస్తున్న బ్యూటీ
తన గ్లామరస్ ఫోటోలు, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను చూసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పెట్టిన ఈ బ్యూటీ, నెలకు లక్షల్లో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
By: Madhu Reddy | 24 March 2026 11:37 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'చిరుత' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ, సినిమాల్లో ఆశించిన స్థాయిలో హిట్లు కొట్టలేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. తన గ్లామరస్ ఫోటోలు, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను చూసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పెట్టిన ఈ బ్యూటీ, నెలకు లక్షల్లో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వెండితెరపై అవకాశాలు తగ్గుతున్నా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఆదాయ మార్గంగా మార్చుకుని నేహా శర్మ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ విశేషాలు చూద్దాం..
సినిమాల్లో రాని లాభం ఇక్కడ వస్తుంది :
నేహా శర్మ కెరీర్ చూస్తే బాలీవుడ్, టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేహా, ఓటీటీలో 'ఇల్లీగల్' వంటి వెబ్ సిరీస్‌లు చేసినా అవి కూడా ఆమె రేంజ్‌ను పెంచలేదు. కానీ, సినిమాల సక్సెస్ రేటుతో సంబంధం లేకుండా కేవలం గ్లామర్‌తో నెలకు దాదాపు 7 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తోందంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో ఫెయిలైనా ఫేమ్ ఉంటే చాలు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించవచ్చని ఆమె నిరూపిస్తోంది.
సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో సరికొత్త బిజినెస్:
నేహా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం నెలకు 290 రూపాయల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పెట్టింది. ప్రస్తుతం ఆమెకు దాదాపు 2,454 మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంటే ఎటువంటి షూటింగులు లేకపోయినా, ఇంట్లో కూర్చుని కేవలం ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఆమె భారీగా వెనకేస్తోంది. టాప్ హీరోయిన్ల రేంజ్ ఎలా ఉన్నా, వరుస ఫ్లాపుల్లో ఉన్న ఒక నటి కూడా సోషల్ మీడియా ద్వారా ఇంత ఆదాయం పొందడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
జిమ్ వీడియోలు.. హాట్ ఫోటోషూట్:
నేహా శర్మ తన సినిమాల కంటే ఎక్కువగా జిమ్ వర్కౌట్ వీడియోలు, బోల్డ్ ఫోటోషూట్‌ల ద్వారానే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇక ఈ గ్లామర్ కంటెంట్ చూసేందుకే జనం ఎగబడుతున్నారు. సాధారణంగా ఇలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు మహిళా సెలబ్రిటీలకే ఎక్కువగా వర్కవుట్ అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మగ సెలబ్రిటీలు ఇలాంటివి పెట్టినా ఇంతమంది సబ్‌స్క్రైబర్లు వచ్చే అవకాశం తక్కువ. కేవలం గ్లామర్‌ను నమ్ముకుని నేహా శర్మ చేస్తున్న ఈ డిజిటల్ బిజినెస్ ఇప్పుడు ఇతర నటీమణులకు కూడా ఒక మార్గంగా కనిపిస్తోంది.
ఆదాయ మార్గాలపై కొత్త చర్చ:
గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వారికి అవకాశాలు పోయినా ఆదాయం పోదని నేహా శర్మ ఉదాహరణతో స్పష్టమవుతోంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు లేకపోయినా, భారీ రెమ్యునరేషన్లు ఇచ్చే నిర్మాతలు లేకపోయినా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంటే చాలు లైఫ్ సెటిల్ చేసుకోవచ్చని అర్థమవుతోంది. నేహా శర్మ బాటలోనే మరికొందరు హీరోయిన్లు కూడా ఇలాంటి పెయిడ్ కంటెంట్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. మొత్తానికి నేహా శర్మ తన ఫెయిల్యూర్ కెరీర్‌ను కూడా ఫైనాన్షియల్ సక్సెస్‌గా మార్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
