ED ముందు రామ్ చరణ్ హీరోయిన్...!
రామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ.
By: Ramesh Palla | 3 Dec 2025 8:13 PM ISTరామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. చరణ్ కెరీర్‌లో దూసుకు పోతే, నేహా శర్మ మాత్రం అనవసరపు ప్రయత్నాలు, సినిమాల కారణంగా ఇంకా ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. తెలుగులో ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా కూడా ఇప్పటికీ మంచి గుర్తింపును కలిగి ఉంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బాలీవుడ్, పంజాబీ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా అన్ని చోట్ల వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల్లో ఈమెకు ఉన్న గుర్తింపు కారణంగా సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసిన వెంటనే తెలుగు మీడియాలో ఈమె గురించి ప్రత్యేకంగా చర్చ జరగడం మనం చూస్తూ ఉంటాం.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్...
తాజాగా ఈ అమ్మడి గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఫోటోలు, సినిమాల గురించి కాకుండా ఒక కేసు విషయమై ఈమె వార్తల్లో నిలిచింది. ఒక బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినందుకు గాను ఈమెపై ఈడీ కేసు ఫైల్ చేసిందని సమాచారం అందుతోంది. కొంత కాలం పాటు ఆ బెట్టింగ్ యాప్ ను తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ప్రచారం చేయడంతో పాటు, పలు వేధికల మీద కూడా ఆ యాప్ ను ఈమె ప్రమోట్ చేసిందని, తద్వారా భారీ మొత్తంలో డబ్బును సొంతం చేసుకుందని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. సుదీర్ఘ సమయం పాటు ఆమెను అధికారులు పలు ప్రశ్నలతో విచారించారని మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విచారణ ఎంత వరకు సాగింది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.
నేహా శర్మ పై ఈడీ అధికారులు కేసు...
కేవలం నేహా శర్మ మాత్రమే కాకుండా పలువురు బాలీవుడ్ స్టార్స్, ఇతర భాషల స్టార్స్ సైతం బెట్టింగ్ యాప్స్ ను గతంలో ప్రమోట్ చేసినందుకు గాను ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. గతంలో తెలిసి తెలియక, ఇంతగా డ్యామేజ్ జరుగుతుందనే విషయం ఊహించని కారణంగానే వీరు అంతా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లుగా చెబుతున్నారు. అంతే కాకుండా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారంను కొందరు సెలబ్రిటీలు కొట్టి పారేస్తున్నారు. వారు ఇచ్చిన డబ్బుతో ఆస్తులు కూడబెట్టలేదని ఇటీవల ఒక సెలబ్రిటీ అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశాడు. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని తెలిసిందో అప్పటి నుంచే దాదాపు అందరు సెలబ్రిటీలు సైతం ఆ యాప్స్ ను ప్రమోట్ చేయడం మానేసిన విషయం తెల్సిందే.
బాలీవుడ్‌తో పాటు పంజాబీ సినిమాలు...
నేహా శర్మకు భారీ మొత్తంలో డబ్బు వచ్చి పడింది అనేది అవాస్తవం అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గతంలో నేహా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన కారణంగా ఇప్పుడు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ నుంచి డబ్బులు వచ్చాయి, ఎంత వరకు వచ్చాయి అనే విషయాలను వారు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం అందుతోంది. మళ్లీ విచారణ ఉంటుందా అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది, అంతే కాకుండా ఈడీ అధికారులు, ఇతర విచారణ అధికారులు ఈ విషయమై ఎంక్వైరీ చేస్తున్నారు. కనుక ఇప్పుడే ఆమె గురించి ఒక నిర్ణయానికి రావడం సరైన నిర్ణయం కాదని కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి నేహా శర్మ పంజాబీ సినిమాలో నటిస్తోంది. ఆ తర్వాత ఒక హిందీ సినిమాను ఈమె చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టాలీవుడ్‌లోనూ ఈమె మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
