డైరెక్టర్ గా షాక్ ఇచ్చిన చిరుత పిల్ల!
ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయంటారు. తాజాగా ఈ మాట మరోసారి నిజం చేసేలా ఉంది ముంబై బ్యూటీ నేహాశర్మ.
By: Srikanth Kontham | 20 Aug 2025 3:00 PM ISTఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయంటారు. తాజాగా ఈ మాట మరోసారి నిజం చేసేలా ఉంది ముంబై బ్యూటీ నేహాశర్మ. ఈ బ్యూటీ టాలీవుడ్ కి `చిరుత` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే గ్రాండ్ హిట్ అందుకుంది. కానీ ఆసక్సెస్ ని కంటున్యూ చేస్తూ తెలుగులో అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది. రెండు..మూడు తెలుగు సినిమాలతోనే బాలీవుడ్ కి పరిమితమైంది.
హాట్ బ్యూటీ కొత్త అవతారం:
కెరీర్ ఆరంభంలోనే హిందీ అవకాశాలతో బిజీ అయింది. కానీ నటిగా మాత్రం రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఖాళీగా లేకుండా దశాబ్దం పాటు ప్రయాణాన్ని కొనసాగించింది గానీ ఇండస్ట్రీలో నటిగా తన మార్క్ మాత్రం వేయలేకపోయింది. సినిమా ల్లో నటికంటే? సోషల్ మీడియాలో చిట్టిపొట్టి దుస్తుల్లోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఇన్ స్టా వేదికగా అమ్మడు చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు.
నిర్మాతగా స్టార్ హీరో:
తాజాగా ఈ బ్యూటీ దర్శకురాలిగా కొత్త ప్రయాణానికి రెడీ అవుతోంది. అదీ ఆషామాషీ చిత్రం కాదు. ఏకంగా ఓ భారీ యాక్షన్ చిత్రానికే సంకల్పించింది. ఇందులో సిద్దాంత్ చతుర్వేది, మోహిత్ కీలక పాత్రలు పో షిస్తున్నారు. 1985 నేపథ్యంలో సాగే పిరియాడిక్ చిత్రమిది. ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది చిన్న చితాకా హీరో కాదు. నేహాశర్మ ట్యాలెంట్ ను నమ్మి ఏకంగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇదో సంచలనం:
ఆయన సొంత నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రం నిర్మాణం కానుంది. దీంతో నేహా శర్మ పేరు మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అమ్మడిలో క్రియేటివ్ యాంగిల్ కూడా ఉందా? అని చర్చించుకుంటున్నారు.
ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక? అన్నట్లు ఎవరి ట్యాలెంట్ ఎంత? అన్నది ముందే అంచనా వేయ లేం. నటిగా ఫేం సాధించలేని బ్యూటీ దర్శకురాలిగా సక్సెస్ అయితే? ఆమె జాతకమే మారిపోతుంది.
అసలే బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ. క్రియేటివ్ రంగంలో మహిళలు కూడా రాణించాలని మేథా వర్గం కోరుకుంటోన్న నేపథ్యంలో? నేహా శర్మ కెప్టెన్ కుర్చీ ఎక్కడం ఇప్పుడో సంచలనం.
