Begin typing your search above and press return to search.

పొట్టి డ్రెస్ లో విదేశీ వీధుల్లో సెగలు పుట్టిస్తున్న రామ్ చరణ్ బ్యూటీ!

సెలబ్రిటీలు ఎక్కువగా విదేశాలలో తిరుగుతూ.. షాపింగ్ చేస్తూ అక్కడి ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   25 Jun 2026 11:12 AM IST
పొట్టి డ్రెస్ లో విదేశీ వీధుల్లో సెగలు పుట్టిస్తున్న రామ్ చరణ్ బ్యూటీ!
X

సెలబ్రిటీలు ఎక్కువగా విదేశాలలో తిరుగుతూ.. షాపింగ్ చేస్తూ అక్కడి ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు తమ గ్లామర్ తో ఇటు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ను అలరిస్తున్నారు. అలాంటివారిలో రామ్ చరణ్ బ్యూటీ నేహా శర్మ కూడా ఒకరు. చురకత్తు ల్లాంటి చూపులతో అందరినీ మైమరిపించే గ్లామర్ తో అలరిస్తున్న నేహా శర్మ.. తాజాగా మరోసారి లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన నేహా శర్మ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.




అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఇటీవల చికాగో కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ మురిసిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా డీప్ వీ నెక్ కలిగిన బ్లాక్ క్రాప్ టాప్ ధరించి దీనికి కాంబినేషన్లో బ్లాక్ మినీ స్కర్ట్ ధరించింది. ఇక ఈ కాంబినేషన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో గ్లామర్ వలకబోస్తూ నేహా శర్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అమ్మడి గ్లామర్ లుక్కుకి చికాగో అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇకపోతే గ్లామర్ అందాలను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది. పువ్వులు, పిల్లులు, షికార్లు కాస్త నాకంటూ సమయాన్ని కేటాయించుకునే చిన్న చిన్న యాదృచ్ఛిక ఆనందాలన్నింటినీ నేను చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాను" అంటూ నేహా శర్మ రాసుకుంది. మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఫోటోలు , పెట్టిన క్యాప్షన్ వైరల్ అవుతున్నాయి.

1987 నవంబర్ 21న బీహార్ లోని ఒక హిందూ కుటుంబంలో జన్మించింది. భాగల్పూర్ లోని మౌంట్ కార్మెల్ స్కూల్లో చదివి, న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఫ్యాషన్ డిజైన్ కోర్సును పూర్తి చేసింది . చిన్నతనంలోనే ఈమెకు తీవ్రమైన ఆస్తమా ఉండేదని, శారీరకంగా ఎప్పుడు అనారోగ్యంగా, బలహీనంగా ఉండేదాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే హైదరాబాదులోని బంధువుల సహాయంతో తన సమస్యను తగ్గించుకున్నానని, ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని కూడా తెలిపింది నేహా శర్మ.

నేహా శర్మ వ్యక్తిగత అభిరుచుల విషయానికొస్తే.. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, వంట చేయడం, డాన్స్ చేయడం లాంటివి ఈమెకు చాలా ఇష్టం. ముఖ్యంగా శర్మ కథక్ అనే భారతీయ శాస్త్రీయ నృత్య రూపంలో కూడా శిక్షణ తీసుకుంది. లండన్ లోని పైనాపిల్ డాన్స్ స్టూడియోస్ నుండి స్ట్రీట్ హిప్ హాప్ హాప్, లాటిన్ డాన్సింగ్ సల్సా వంటి వాటిని నేర్చుకుంది. ఇకపోతే జీవితంలో సొంతంగా దుస్తుల లేబుల్ ను ప్రారంభించాలని కలలు కంటోంది.