పొట్టి స్కర్టుల్లో సంపుతున్న సింగర్-డ్యాన్సర్ జోడీ
నేహా కక్కర్ కొరియోగ్రాఫర్ ధనశ్రీని విపరీతంగా అభిమానిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. తన ఉత్తమ అభిమానులలో ధనశ్రీ ఒకరు అని కూడా చెప్పుకొచ్చారు.
By: Sivaji Kontham | 19 Aug 2025 6:00 AM ISTపొట్టి స్కర్టులు.. టైట్ టాప్ లు...మత్తెక్కించే థైషోలు.. ఇద్దరు అందమైన క్వీన్స్ డ్యాన్సులాడుతూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే నెటిజనం ఊరుకుంటారా? .. భామల అందచందాలకు, వయ్యారానికి ఫిదా అయిపోతున్నారు. ఆ డ్యాన్సింగ్ స్టైల్ కి మత్తెక్కి ఊగిపోతున్నారు. అంతగా ఉర్రూతలూగించేస్తోంది కాబట్టే.. ఈ స్పెషల్ `బద్మాష్` ట్రాక్ ఇంటర్నెట్ లో వైరల్ గా దూసుకెళుతోంది.
ట్యాలెంటెడ్ గాయని నేహాకక్కర్, ఎనర్జిటిక్ లైవ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ జోడీ అలా పొట్టి దుస్తుల్లో డ్యాన్సులు చేస్తుంటే కుర్రకారు మతి చెడి ఈ క్లిప్ ని వైరల్ గా షేర్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే అర మిలియన్ లైక్‌లను దాటింది. ఇద్దరు భామల వయ్యారం అభిమానులను కట్టిపడేస్తోంది.
ఒక పాట పాడేందుకు హృదయాన్ని అంకితమిచ్చే నేహాకక్కర్‌కి, గొప్ప ఈజ్ తో ఇన్వాల్వ్ మెంట్‌తో కొరియోగ్రాఫ్ చేసే ధనశ్రీ జత కలిసే సరికి ఆ ఫ్రేమ్ కి ప్రత్యేక ఆకర్షణ వచ్చేసింది. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. నేహా కూడా ధనశ్రీతో పోటీపడుతూ డ్యాన్స్ చేయడం ఆసక్తిని కలిగించింది. అది రీల్‌ను తక్షణ హిట్ చేసింది. నియాన్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ దుస్తుల్లో ఆ ఇద్దరూ స్పెషల్ గా కనిపించారు. చాలా పరిశీలనగా గమనిస్తే, ఒకరి టాప్ కలర్ మరొకరికి బాటమ్ కలర్.. ఒకరి బాటమ్ కలర్ మరొకరికి టాప్ కలర్! ఈ డ్రెస్ కాంబినేషన్ సెట్టింగ్ కూడా ఫ్రేమ్ కి మరింత అదనపు ఆకర్షణను పెంచింది.
నేహా కక్కర్ కొరియోగ్రాఫర్ ధనశ్రీని విపరీతంగా అభిమానిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. తన ఉత్తమ అభిమానులలో ధనశ్రీ ఒకరు అని కూడా చెప్పుకొచ్చారు. అదే సమయంలో నేహా పాటలను ధనశ్రీ అమితంగా ఆరాధిస్తుంది. అందుకే ఇద్దరూ `అభిమానులు`గా ఒకరికోసం ఒకరు కలిసారు. ఫ్యాన్స్ కలయికలోని స్పెషల్ రీల్ ఇన్ స్టంట్ గా పెద్ద హిట్టయింది. దీనిపై నెటిజనుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. బద్మాష్ ట్రాక్ కి టోనీకక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనశ్రీ ఇటీవల ఓ టాలీవుడ్ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించింది. అంతకుముందు బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావు సినిమాలోను ఒక ప్రత్యేక గీతంలో అలరించింది.
