శర్మా గాళ్స్ 'పని తక్కువ పరాచికాలెక్కువ'
ఈరోజు ఐషా శర్మ తన పుట్టినరోజు సందర్భంగా తన సోదరి నేహా శర్మతో కలిసి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పార్క్‌లో `ఆస్ట్రేలియన్ ఓపెన్` టెన్నిస్ మ్యాచ్‌ను వీక్షించారు.
By: Sivaji Kontham | 25 Jan 2026 5:42 PM ISTశర్మా సిస్టర్స్ నేహా శర్మ, ఐషా శర్మ పరిచయం అవసరం లేదు. ఖిలాడీ సోగ్గత్తెలు బీహార్ కి చెందిన కాంగ్రెస్ నాయకుడి గారాల కుమార్తెలు. ముంబైని ఏలేందుకు ఇండస్ట్రీకి దూసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తూ వీళ్లకు ఫోకస్ ఎక్కువ పని తక్కువ. ఇటీవల కొంతకాలంగా శర్మాగాళ్స్ సోషల్ మీడియా హంగామా హాట్ టాపిక్‌గా మారుతోంది. సినిమాల కంటే కూడా ఈ భామల విదేశీ పర్యటనలు, గ్లామరస్ ఫోటోషూట్లతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు.
ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో శర్మా సిస్టర్స్ హంగామా మామూలుగా లేదు. ఈరోజు ఐషా శర్మ తన పుట్టినరోజు సందర్భంగా తన సోదరి నేహా శర్మతో కలిసి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పార్క్‌లో `ఆస్ట్రేలియన్ ఓపెన్` టెన్నిస్ మ్యాచ్‌ను వీక్షించారు. తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో `బకెట్ లిస్ట్ అన్‌లాక్డ్` (చాలా కాలంగా అనుకుంటున్న కోరిక తీరింది) అంటూ కోర్ట్ సైడ్ ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోగ్రాఫ్స్ లో ఐషా శర్మ టూ హాట్ గా కనిపిస్తోంది.
ఇక నేహా శర్మ పరిచయం అవసరం లేదు. `చిరుత` సినిమాతో తెలుగులో మంచి ఆరంభం లభించినా, ఇక్కడ ఎందుకనో సినిమాలు చేయలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో పెద్ద స్టార్ అవ్వాలని కలలు కంది. కానీ అక్కడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తన సోదరి ఐషా శర్మ కూడా కెరీర్ పరంగా అంతంతమాత్రంగానే ప్రయాణం సాగిస్తోంది. శర్మా సిస్టర్స్ అప్పుడప్పుడు కొన్ని వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలలో కనిపిస్తున్నారు.
ఐషా శర్మ గతంలో జాన్ అబ్రహం సరసన `సత్యమేవ జయతే`తో ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. సినిమాల కంటే ఫిట్‌నెస్ వీడియోలు, ట్రావెల్ బ్లాగ్స్ పైనే ఐషా దృష్టి పెడుతున్నారు. చేతిలో సినిమాలు లేకపోయినా ఇంత లగ్జరీ లైఫ్ ఎలా గడుపుతున్నారు? అని కొందరు, ``పని తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ`` అని మరికొందరు శర్మా గాళ్స్‌పై కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, ఈ సిస్టర్స్ మాత్రం ఇలాంటి నెగటివిటీని పెద్దగా పట్టించుకోరు. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, పెయిడ్ ప్రమోషన్ల ద్వారా వీరు భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమాలు ఉన్నా లేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా టూర్లు వేస్తూ ఫోటోషూట్లతో సందడి చేస్తున్నారు.
ఐషా శర్మ తన పుట్టినరోజును ఇలా సెలబ్రేట్ చేసుకోవడం జస్ట్ ఫర్ పబ్లిసిటీ అని భావించాలా? కేవలం గ్లామర్ నమ్ముకుంటే నటిగా కెరీర్ ఎక్కువ కాలం సాగుతుందా? సిస్టర్స్ స్వయంగా అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుందేమో!
