Begin typing your search above and press return to search.

రూ.15 కోట్ల హ్యాండ్‌ బ్యాగ్‌తో...!

అత్యంత ఖరీదైన ఔట్‌ ఫిట్‌తో నీతా అంబానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె ధరించిన సిల్వర్ కోటెడ్‌ చీర సైతం అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Ramesh Palla   |   14 Oct 2025 7:50 PM IST
రూ.15 కోట్ల హ్యాండ్‌ బ్యాగ్‌తో...!
X

బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు బిజినెస్ వర్గాల వారు పెద్ద ఎత్తున హాజరు అయ్యే మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాధారణంగానే బాలీవుడ్‌ సెలబ్రిటీల డ్రెస్‌ల గురించి, వారు ధరించిన వాచ్‌లు, వేసుకున్న హ్యాండ్‌ బ్యాగ్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే వ్యాపారవేత్తల గురించి మాత్రం పెద్దగా చర్చ జరగదు. కానీ అంబానీ ఫ్యామిలీకి చెందిన వారు ఎవరైనా ఇలాంటి వేడుకల్లో పాల్గొంటే ఖచ్చితంగా చర్చనీయాంశం కావడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకలో అంబానీ ఫ్యామిలీ నుంచి నీతా అంబానీ హాజరు అయ్యారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఏమాత్రం తగ్గకుండా నీతా అంబానీ ఈ వేడుకలో మీడియా దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె చేతిలో పట్టుకున్న హ్యాండ్‌ బ్యాగ్‌ గురించి అంతా ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది.

మనీష్ మల్హోత్రా పార్టీలో...

బాలీవుడ్‌ సెలబ్రిటీల నుంచి మీడియా వారి వరకు అందరి దృష్టిని ఆకర్షించిన నీతా అంబానీ హ్యాండ్‌ బ్యాగ్‌ గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ బ్యాగ్‌ యొక్క రేటు, ఇతర వివరాల గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తిని కనబర్చుతున్నారు. నీతా అంబానీ చేతిలో ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌ హెర్మేస్‌ కెల్లీమార్ఫోస్‌ హ్యాండ్‌ బ్యాగ్‌గా చెప్పబడింది. ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ ఖరీదు దాదాపుగా రూ.15 కోట్ల విలువ చేస్తుందని అంటున్నారు. ఈ హ్యాండ్‌ బ్యాక్‌ మొత్తంగా వజ్రాలతో పొదిగి ఉంటుంది. అది కూడా అత్యంత ఖరీదైన వజ్రాలను ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ డిజైన్‌లో వినియోగించారని అంటున్నారు. అందుకే ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ కి అంత డిమాండ్‌ అన్నట్లుగా చెబుతున్నారు.

నీతా అంబానీ ఖరీదైన హ్యాండ్‌ బ్యాగ్‌

అత్యంత ఖరీదైన ఔట్‌ ఫిట్‌తో నీతా అంబానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె ధరించిన సిల్వర్ కోటెడ్‌ చీర సైతం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చీర గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ స్థాయిలో ఖరీదైన చీరను బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం కట్టలేరు అంటూ కొందరు మాట్లాడుతూ ఉంటే, ఈ సిల్వర్ చీర కట్టడంతో నీతా అంబానీ తన స్థాయిని చూపించే ప్రయత్నం చేసిందని అంటున్నారు. మొత్తానికి నీతా అంబానీ ధరించిన బ్యాగ్‌, కట్టుకున్న చీర, ప్రయాణించిన కారు ప్రతి ఒక్కటీ చాలా స్పెషల్‌గా ఉండటంతో మనీష్ మల్హోత్ర యొక్క దీపావళి పార్టీ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. నీతా అంబానీ గురించి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కంటే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

అంబానీ ఫ్యామిలీ అంటే అంతే మరి

నీతా అంబానీ ప్రతీ వస్తువు చాలా ఖరీదుగా ఉండాలని కోరుకుంటారని, ఆమె తాను వాడే వస్తువులతో తన స్థాయిని, తన యొక్క హోదాను చూపించే ప్రయత్నం చేస్తుందని అంటారు. అందుకే ఆమెను కొందరు విమర్శించే వారు కూడా ఉన్నారు. అంబానీ కుటుంబం అంటే దేశంలోనే అత్యంత ధనవంతుల ఫ్యామిలీగా గుర్తింపు ఉంది. అలాంటి ఫ్యామిలీ నుంచి ఒక పార్టీకి నీతా అంబానీ హాజరు అయితే ఖచ్చితంగా అందుకు తగ్గట్లుగానే ఉండాలి కనుక ఆమె అంతటి ఖరీదైన బ్యాగ్‌ ను ధరించి, ఖరీదైన చీరను ధరించి ఉంటారని అంటారు. ప్రస్తుతం ఈ బ్యాగ్‌ గురించి, ఆమె ధరించిన చీర గురించి సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.