Begin typing your search above and press return to search.

గోవిందా-సునీత వివాదం వేళ.. తెరపైకి వచ్చిన నీలమ్ కొఠారి ఎఫైర్!

1980- 90ల ప్రారంభంలో బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హిట్ జోడీలలో గోవిందా- నీలమ్ కొఠారి జంట ఒకటి.

By:  Srikanth Kontham   |   14 Sept 2026 10:29 PM IST
గోవిందా-సునీత వివాదం వేళ.. తెరపైకి వచ్చిన నీలమ్ కొఠారి ఎఫైర్!
X

1980- 90ల ప్రారంభంలో బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హిట్ జోడీలలో గోవిందా- నీలమ్ కొఠారి జంట ఒకటి. ఇద్ద‌రి మధ్య ప్రేమ వ్యవహారం కూడా నడిచిందనే ప్రచారాలు దశాబ్దాలుగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నీలమ్ కొఠారి ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో గోవిందాకు వివాహమైందనే విషయం తనకు అసలు తెలియదని వెల్లడించారు. ఆ సమయంలో తాను చాలా చిన్న వయస్కురాలినని .. తల్లిదండ్రులు చాలా పద్ధతిగా, కఠినంగా ఉండే వారని తెలిపారు.

`నేను చాలా చిన్నదాన్ని, గోవిందాకు పెళ్లయిందనే విషయం తెలియదు. కొన్ని రోజుల‌కు తర్వాతే విష‌యం తెలిసింది. నా తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్ కావడంతో ప్రేమాయణం న‌డిపేంత స్వేచ్ఛ నాకు లేదు. చిత్ర పరిశ్రమ చెడ్డ ప్రదేశం కాక‌పోయినా? చిన్న వయసు కారణంగా ఎప్పుడూ కుటుంబ సభ్యుడొకరు తనతోనే ఉండేదాన్ని అని గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నీలమ్ భర్త, నటుడు సమీర్ సోని కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ రూమర్ల పట్ల తాను అసలు క‌ల‌వ‌ర‌ప‌డ‌లేద‌న్నారు. 20 ఏళ్ల క్రితం జరిగిందో? లేదో? తెలియని విషయం గురించి ఇప్పుడు పట్టుకుని ఎలా కూర్చుంటాను? ఇప్పటికీ ఆయన (గోవిందా) నీలమ్‌ను ఎంతగానో ప్రేమించానని చెబుతుంటారు అని సమీర్ సోని వ్యాఖ్యానించారు.

1990లో స్టార్‌డస్ట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూలో మాత్రం గోవిందా- నీలమ్‌పై తనకున్న ప్రేమను బహిరంగంగానే ఒప్పుకున్నారు. నీలమ్ పట్ల ఉన్న ఆకర్షణను దాచడం కష్టమైందని.. ఆమెను వివాహం చేసుకోవా లనుకుని తన ప్రస్తుత భార్య సునీతా ఆహుజాతో ఎంగేజ్‌మెంట్ కూడా రద్దు చేసుకున్నట్లు గోవిందా అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నీలమ్‌ను ఎంతగానో పొగిడేవాడినని.. సునీతను కూడా నీలమ్‌లా మారాలని ఒత్తిడి చేశానని పేర్కొన్నారు.

నీలమ్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరికతో సునీతతో నిశ్చితార్థం రద్దు చేసుకున్న ఐదు రోజుల తర్వాత నీల‌మ్ మళ్లీ ఫోన్ చేసి సర్దిచెప్పడంతో ముందుకెళ్లాన‌ని గోవిందా తెలిపారు. ఒకవేళ నీల‌మ్ మళ్లీ మాట్లాడకపోయి ఉంటే తాను ఖచ్చితంగా నీలమ్‌నే పెళ్లి చేసుకునేవాడినని ఆనాటి ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం గోవిందా -ఆయన భార్య సునీతా ఆహుజాల మధ్య బంధం వీగిన సంగ‌తి తెలిసిందే. ఇరువురు బహిరంగంగానే ఒకరినొకరు విమ‌ర్శించుకుంటోన్న వేళ నీలమ్ కొఠారి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.