NC24: నాగచైతన్య కోసం వారణాసి రుద్రుడు.. ఓ మంచి ప్లాన్!
చైతు బర్త్‌డే సందర్భంగా నవంబర్ 23న ఉదయం 10:08 గంటలకు ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
By: M Prashanth | 22 Nov 2025 3:39 PM ISTయువసామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న మైథికల్ థ్రిల్లర్ NC24 పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. చైతు బర్త్‌డే సందర్భంగా నవంబర్ 23న ఉదయం 10:08 గంటలకు ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో నిప్పు రాజేసింది.
వారణాసి 'గ్లోబ్ ట్రాటర్' అనే బిరుదుతో ఇప్పటికే మహేష్ సినిమాకు కావాల్సినంత హైప్ దక్కింది. సినిమాలో రుద్ర పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక NC24 సినిమాలో ట్రెజర్ హంటర్ పాత్ర చేస్తున్న చైతుకు తోడుగా నిలబడటం ఒక మాస్టర్ స్ట్రోక్. దీని వెనుక ఉన్న టీమ్ విజన్ చాలా క్లియర్‌గా ఉంది. NC24 ఒక లోకల్ సినిమా కాదనే సిగ్నల్‌ను మొదటి ప్రమోషన్ స్టెప్‌లోనే ఇచ్చేశారు. అలాగే వారణాసి సినిమాలో కూడా రాజమౌళి ట్రెజట్ హంట్ ఎపిసోడ్స్ ని చూపించనున్నారు. యాదృచ్చికంగా రెండు సినిమాలకు కొంత కనెక్షన్ అయితే ఉందనిపిస్తుంది.
ఇక మహేష్ పేరు లైన్‌లోకి రాగానే ఈ సినిమాకి ఆటోమేటిక్‌గా పాన్ ఇండియా బజ్ వచ్చింది. ఒక పెద్ద స్టార్ సపోర్ట్ చేయడం వల్ల, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇంకా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరుతుంది. సినిమా చూసిన ఆడియన్స్ కూడా సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే ఇలాంటి స్మార్ట్ డెసిషన్స్ ఎప్పుడూ మంచి ఆలోచనలే.
NC24 లాంటి ఫాంటసీ థ్రిల్లర్‌కు ఒక గ్రాండ్ లాంచ్ అవసరం. ఆ గ్రౌండ్ వర్క్‌ను మహేష్ లాంటి స్టార్‌తో స్టార్ట్ చేయించడం టీమ్ సత్తాను చూపిస్తుంది. ఈ లాంచ్‌తో NC24 రేంజ్ ఏమిటో ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమాకు 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ చేస్తున్నాడు. కథ, కథనంపై ఆయనకు ఉన్న పట్టు, సినిమాను హ్యాండిల్ చేసే ఆయన టాలెంట్ తెలిసిందే.
సుకుమార్ రైటింగ్స్, SVCC బ్యానర్‌లు కలిసి దీనిని భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. కాబట్టి సినిమాను పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా డిజైన్ చేస్తారని చెప్పవచ్చు. చైతు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, 'లాపతా లేడీస్' యాక్టర్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా చేస్తున్నారు. పర్ఫెక్ట్ కాస్టింగ్, స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్, సూపర్ స్టార్ బూస్ట్.. ఇవన్నీ NC24 కు పెద్ద ప్లస్ పాయింట్స్.
నాగ చైతన్యకు బర్త్‌డే గిఫ్ట్‌గా దొరికిన ఈ మెగా లాంచ్, ఆయన కెరీర్‌లో ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది. రేపు ఉదయం NC24 టైటిల్, ఫస్ట్ లుక్ ఎలాంటి వైరల్ ట్రెండ్ సెట్ చేస్తుందో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం నాగచైతన్య ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనే యాక్షన్ ఘట్టాలు ఉంటాయని తెలుస్తోంది.
