హీరో డేట్స్ మిస్ అయినా సినిమా ఆగదు.. టాలీవుడ్ కొత్త ఫార్ములా ఇదే!
హీరో గాయం తర్వాత కూడా సినిమా ఆలస్యం కాకుండా చూసే ప్రయత్నం, హీరో కమిట్‌మెంట్‌తో పాటు నిర్మాతల రిస్క్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
By: Sravani Lakshmi Srungarapu | 10 Aug 2026 3:40 PM ISTఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకి గాయం కావడం లేదా డేట్స్‌లో మార్పులు రావడం అనేది కొత్త విషయం కాదు. అయితే అలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌ను పూర్తిగా నిలిపివేయడం కంటే, షెడ్యూల్‌ను తిరిగి ప్లాన్ చేసి బడ్జెట్‌ను నియంత్రించడం ఇప్పుడు నిర్మాతలు ఎక్కువగా అనుసరిస్తున్న స్ట్రాటజీగా మారుతోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల్లో ప్రతి రోజూ ఖర్చు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉండటంతో, సమయ నిర్వహణ ప్రొడక్షన్‌లో కీలక అంశంగా మారింది.
సాధారణంగా స్టార్ అందుబాటులో లేని టైమ్ లో యూనిట్ పూర్తిగా ఖాళీగా ఉండదు. కథలోని ఇతర పాత్రలకు సంబంధించిన సీన్స్, విలన్ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్, మాంటేజ్ షాట్స్, ఎస్టాబ్లిషింగ్ విజువల్స్, సెట్ ఆధారిత సన్నివేశాలు వంటి ఎపిసోడ్స్ ను ముందుగా తెరకెక్కిస్తారు. దీనివల్ల షూటింగ్ ఆగిపోకుండా, వేరే వారితో సినిమా షూటింగ్ పూర్తవుతూ ఉంటుంది.
ఈ విధానంలో నిర్మాతలకు ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఇప్పటికే వేసిన సెట్లు, బుక్ చేసిన లొకేషన్లు, టెక్నీషియన్ల డేట్స్ వృథా కావు. షూటింగ్ పూర్తిగా ఆపేస్తే సెట్ రెంటల్, టెక్నికల్ ఎక్విప్‌మెంట్ రెంట్, టీమ్ రెమ్యూనరేషన్, లాజిస్టిక్స్ వంటి ఖర్చులు అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ షెడ్యూల్‌ను రీడిజైన్ చేస్తే అదే బడ్జెట్ పరిధిలో ఎక్కువ పని పూర్తి చేయవచ్చు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే చేస్తున్నట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న NBK112 షూటింగ్ ను బాలయ్య లేని సీన్స్ ను షూట్ చేస్తున్నారని సమాచారం. మోకాలి గాయం కారణంగా బాలయ్య రెస్ట్ లో ఉండగా, ఆ సమయాన్ని కొరటాల తెలివిగా ఇలా ఉపయోగించుకుని టైమ్ ను సేవ్ చేస్తున్నారట.
ఇటీవలి కాలంలో డైరెక్టర్లు కూడా స్క్రిప్ట్‌ను షెడ్యూల్ బ్లాకులుగా డివైడ్ చేసి వర్క్ చేస్తున్నారు. హీరో డేట్స్, ఇతర నటీనటులతో పూర్తి చేయగల కాల్షీట్స్ అనే విధంగా ముందుగానే ప్లానింగ్ చేయడం వల్ల అనుకోని అంతరాయాలు వచ్చినా సినిమా టైమ్‌లైన్‌పై ప్రభావం తగ్గుతుంది. ఇది కేవలం నిర్మాతల ఆర్థిక భద్రతకే కాదు, మొత్తం ప్రొడక్షన్ వ్యవస్థకు కూడా స్థిరత్వాన్ని ఇస్తుంది.
హీరో గాయం తర్వాత కూడా సినిమా ఆలస్యం కాకుండా చూసే ప్రయత్నం, హీరో కమిట్‌మెంట్‌తో పాటు నిర్మాతల రిస్క్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఒకప్పుడు షూటింగ్ ఆగిపోవడం వల్ల బడ్జెట్ భారీగా పెరిగే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మాత్రం సెకండరీ ట్రాక్‌లను ముందుగా పూర్తి చేయడం, షెడ్యూల్‌లను పునర్వ్యవస్థీకరించడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించడం వంటి పద్ధతులు ఇండస్ట్రీలో సాధారణ ప్రొడక్షన్ ప్లాన్స్ గా మారుతున్నాయి. చివరికి సినిమా సమయానికి పూర్తి కావడమే కాదు, అనవసర ఖర్చులను తగ్గించడం కూడా ఈ ప్రణాళికల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
