సింగిల్ రోల్ తో సింహం డబుల్ ధమాకా!
నటసింహం బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తొలి పాన్ ఇండియా ప్రయత్నం `అఖండ 2` అటు ఇటు అయినా?ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా బాలయ్య పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు.
By: Srikanth Kontham | 27 May 2026 4:00 PM ISTనటసింహం బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తొలి పాన్ ఇండియా ప్రయత్నం `అఖండ 2` అటు ఇటు అయినా?ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా బాలయ్య పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న చిత్రాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్ #NBK112. తొలిసారి మాస్ అండ్ క్లాస్ డైరెక్టర్ కొరటాల శివతో బాలయ్య జత కట్టడంతో అంచనాలు అంకంతకు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేస్తుంటారు. ఒకేసారి రెండు పాత్రలతో ప్రేక్షక్షకుల్ని అలరిచండంలో బాలయ్య ప్రత్యేకతే వేరు. అనేక విజయాల్లో డ్యూయెల్ రోల్ ఓ సెంటిమెంట్ గానూ వర్కవుట్ అయింది. అయితే వీటికి భిన్నంగా రాబోయే 112వ చిత్రంలో బాలయ్య సింగిల్ రోల్‌లోనే కనిపించబోతున్నారన్నది తాజా సమాచారం. విభిన్న పాత్రల హంగామా లేకుండా? ఒకే ఒక్క పవర్‌ఫుల్ పాత్రతోనే థియేటర్లలో అలరించబోతున్నారు.
కానీ ఆ పాత్ర మాత్రం ఊర మాస్ గా ఉంటుందని అంటున్నారు. పక్కా హై-వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్‌గానే కథ సాగుతుందని సమాచారం. బాలయ్య మార్క్ భారీ డైలాగులు, ఊరమాస్ యాక్షన్ సీక్వెన్సులు, థియేటర్లను షేక్ చేసే ఎలివేషన్లతో కొరటాల స్క్రిప్ట్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారుట. సింగిల్ రోల్ అయినా? ఆ పాత్రలోనే భిన్నమైన షేడ్స్ , గూస్‌బంప్స్ తెప్పించే మేనరిజమ్స్ ఉంటా యని తెలుస్తోంది. మొత్తంగా బాలయ్య రోల్ మాస్ ప్రేక్షకులకు కనులవిందుగా ఉంటుందని చెప్పొచ్చు.ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలిసింది.
బాలయ్య కోసం టాప్ ప్రొడ్యూసర్లు, స్టార్ డైరెక్టర్లు కోసం క్యూ కడుతున్నారుట. 10 కి పైగా ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు సింహానికి సరిపోయే పవర్‌ఫుల్ లైన్స్‌ను సిద్దంగా ఉంచుకున్నారుట. వీరిలో యంగ్ డైరెక్టర్ల నుండి సీనియర్ మేకర్ల వరకు అందరూ నటసింహంతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపి స్తున్నారుట.అదే నిజమైతే బాలయ్య డైరీ కొన్ని సంవత్సరాల పాటు ముందే బ్లాక్ అయినట్లే. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 111వ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `వీర సింహారెడ్డి` భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపైనా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
